ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dubai Duty Free raffle: భారతీయుడికి జాక్‌పాట్!

ABN, First Publish Date - 2021-07-15T16:44:53+05:30

దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఓ భారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. గణేష్ షిండే అనే భారత వ్యక్తి 1 మిలియన్ డాలర్లు(రూ.7.45కోట్లు) గెలుచుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఓ భారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. గణేష్ షిండే అనే భారత వ్యక్తి 1 మిలియన్ డాలర్లు(రూ.7.45కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో షిండే రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మిలీనియం మిలియనీర్ సిరీస్ 363లో భాగంగా షిండే కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం.0207కు ఈ జాక్‌పాట్ తగిలింది. 36 ఏళ్ల షిండే నావికుడిగా పనిచేస్తున్నారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఒక మిలియన్ డాలర్లు గెలవడం నిజంగా చాలా సంతోషంగా ఉందని, ఈ నగదులో కొంత మొత్తాన్ని చారిటీకి వినియోగించనున్నట్లు చెప్పారు.


ఈ సందర్భంగా లాటరీ నిర్వాహకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. షిండే స్వస్థలం మహారాష్ట్రలోని థానే. కాగా, 1999లో ప్రారంభమైన మిలీనియం మిలియనీర్ లాటరీలో ఇప్పటివరకు మొత్తం 181 మంది భారతీయులు జాక్‌పాట్ కొట్టారు. ఇందులో షిండే 181వ భారత వ్యక్తి. అలాగే దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌ లాటరీ టికెట్లు కొనుగోలు చేసే వారిలో భారతీయులే టాప్‌లో ఉన్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.     

Updated Date - 2021-07-15T16:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising