ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమ సంతానం హక్కులు కోసం కోర్టును ఆశ్రయించిన America ఎన్నారైలకు నిరాశ..!

ABN, First Publish Date - 2021-12-05T02:45:55+05:30

త్వరలో మేజర్లు కాబోతున్న తమ పిల్లల హక్కులు కాపాడాలంటూ అమెరికా కోర్టులో కేసు వేసిన భారతీయ అమెరికన్లకు చుక్కెదురైంది. మేజిస్ట్రేట్ జడ్జి ఈ వ్యాజ్యాన్ని కొట్టేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో మేజర్లు కాబోతున్న తమ పిల్లల హక్కులు కాపాడాలంటూ అమెరికా కోర్టులో కేసు వేసిన భారతీయ అమెరికన్లకు చుక్కెదురైంది. మేజిస్ట్రేట్ జడ్జి ఈ వ్యాజ్యాన్ని కొట్టేశారు. గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న అనేక కుటుంబాల్లోని పిల్లలకు 21 ఏళ్లు దాటితే స్వదేశానికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి రావడంతో వారికి రక్షణ కల్పించాలంటూ అనేక మంది ఎన్నారైలు కోర్టులో కేసు దాఖలు చేశారు. అయితే.. వారికి నిరాశే మిగిలింది. 


ప్రస్తుతం అమెరికాలో అనేక మంది ఎన్నారైలు హెచ్-1బీ వీసాపై నివసిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో అనేక మంది గ్రీన్ కార్డుకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే..గ్రీన్ కార్డు జారీకి చాలా సమయమే పడుతోంది. కొన్ని సందర్భాల్లో కార్డు కోసం ఏకంగా 80 ఏళ్లు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే.. హెచ్-1బీ వీసా దారుల పిల్లలకు, జీవిత భాగస్వాములకు అమెరికా ప్రభుత్వం హెచ్-4 వీసా జారీ చేస్తోంది. హెచ్-1బీ వీసాదారుల పిల్లలకు అమెరికాలో డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అని పిలుస్తున్నారు. అయితే..పిల్లలు మేజర్లు కానంత వరకే వారికి ఈ వీసా అందుబాటులో ఉంటుంది. 21 ఏళ్లు దాటిన తరువాత వారు దేశం విడిచి పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ వీసాను పొందడం చాలా కష్టంతో కూడుకున్నది కావడంతో అనేక మంది భారతీయ అమెరికన్ కుటుంబాలు సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయి. 


మరోవైపు.. వలసవచ్చిన వారి పిల్లలకు అమెరికా విడిచి వెళ్లాల్సిన దుస్థితిని తప్పించే సీఎస్‌పీఏ చట్టంలోని నిబంధనలు భారతీయులకు వర్తించాలంటూ ఎన్నారైలు కోర్టును కోరినా ఫలితం లేకపోయింది. అయితే.. తాము మళ్లీ అప్పీలు చేసుకుంటామని పిటిషనర్లు పేర్కొన్నారు. 2020లో ఐదు కుటుంబాలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. అమెరికా ఎన్నారైల ఆశలన్నీ ప్రస్తుతం అమెరికా చట్టసభల పరిశీలనలో ఉన్న అమెరికాస్ చిల్డ్రన్స్ యాక్ట్‌పైనే ఉన్నాయి. చట్టసభల ఆమోదం లభిస్తే తమ సమస్యలు తొలగిపోతాయని ఎన్నారైలు గంపెడాశతో ఉన్నారు. 

Updated Date - 2021-12-05T02:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising