ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahzooz drawలో భారతీయ మహిళకు జాక్‌పాట్.. తొలిసారి కొన్న లాటరీ టికెట్‌పై ఎంత గెలుచుకున్నారంటే..

ABN, First Publish Date - 2021-11-26T15:13:37+05:30

మహజూజ్ వీక్లీ లక్కీ డ్రాలో భారత మహిళ ఒకరు జాక్‌పాట్ కొట్టారు. లాటరీ టికెట్ కొన్న మొదటిసారినే ఆమెకు ఇలా అదృష్టం వరించడం విశేషం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: మహజూజ్ వీక్లీ లక్కీ డ్రాలో భారత మహిళ ఒకరు జాక్‌పాట్ కొట్టారు. లాటరీ టికెట్ కొన్న మొదటిసారినే ఆమెకు ఇలా అదృష్టం వరించడం విశేషం. దీంతో ఆమె లక్ష దిర్హమ్స్(రూ.20.31లక్షలు) గెలుచుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు లెబనానీ పౌరులు సైతం చెరో లక్ష దిర్హమ్స్ గెలిచారు. దుబాయ్‌లో గురువారం నిర్వహించిన మహజూజ్ 52వ వీక్లీ డ్రాలో ఈ ముగ్గురు ప్రవాసులు చెరో రూ.20లక్షలు గెలుచుకున్నారు. భారత్‌కు చెందిన విద్య(31), లెబనాన్ పౌరులైన సుజానే(51), చార్బెల్(35) ఈ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచారు.   


విద్య మాట్లాడుతూ.. మహజూజ్ లాటరీలో పాల్గొన్న తొలిసారి ఇలా భారీ మొత్తం గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాఫెల్ ఐడీ నం. 8131197 తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక తాను గెలిచిన ప్రైజ్‌మనీలో అధిక భాగం తన కూతురి భవిష్యత్తు కోసం వినియోగిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మహజూజ్ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, విద్య షార్జాలో సర్వీస్ కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. అటు మరో మహిళ విజేత సుజానే సైతం భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాను గెలిచిన నగదులో కొంత మొత్తం చారిటీకి ఉపయోగిస్తానన్నారు. ఆమె అబుధాబిలో ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2021-11-26T15:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising