ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూకేలోని భారత వైద్యులు, వైద్య సిబ్బందికి గుడ్‌న్యూస్!

ABN, First Publish Date - 2021-04-10T01:49:22+05:30

కరోనా మహమ్మారితో పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న విదేశీ డాక్టర్లు, నర్సులు, హెల్త్‌కేర్ సిబ్బందికి బ్రిటన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంవత్సరం పాటు వీసా గడువును ఉచితంగా పొ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: కరోనా మహమ్మారితో పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న విదేశీ డాక్టర్లు, నర్సులు, హెల్త్‌కేర్ సిబ్బందికి బ్రిటన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంవత్సరం పాటు వీసా గడువును ఉచితంగా పొడగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది.  ఈ ఏడాది అక్టోబర్ 1తో వీసా గడువు ముగిసే వైద్యులు, నర్సులు, హెల్త్‌కేర్ సిబ్బందితోపాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూడా ఈ పొడగింపు వర్తిస్తుందని యూకే ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ నిర్ణయం వల్ల సుమారు 14వేల మంది లబ్ధి పొందనున్నట్టు పేర్కొంది.


ఈ సందర్భంగా యూకే హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్ మాట్లాడుతూ.. ‘కరోనావైరస్‌కు వ్యతిరేకంగా బ్రిటన్ చేస్తున్న పోరాటానికి నాయకత్వం వహిస్తున్న హెల్త్, కేర్ వర్కర్ల  అంకితభావం మరియు నైపుణ్యం నిజంగా అసాధారణమైనది. వేలాది మంది ప్రాణాలను కాపడటమే కాకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి సేవలు వెలకట్టలేనివి. అయినా ఉచితంగా వీసాల గడువును పొడగిస్తూ.. ఈ హీరోల సహకారం ఎంత విలువైందో బ్రిటన్ తెలుపుతోంది’ అని పేర్కొన్నారు. కాగా.. గత ఏడాది నవంబర్‌లో కూడా బ్రిటన్ ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అక్కడ పని చేస్తున్న భారతీ డాక్టర్లు, నర్సులకు లబ్ధి చేకూరనుంది. 


Updated Date - 2021-04-10T01:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising