ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రాంప్టన్‌లో భారతీయ సమాజం తిరంగ ర్యాలీ..

ABN, First Publish Date - 2021-03-02T20:19:59+05:30

కెనడాలోని భారతీయ సమాజం ఆ దేశంతో బలమైన సంబంధాలను కోరుతూ ఆదివారం బ్రాంప్టన్‌లో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంటారియో: కెనడాలోని భారతీయ సమాజం ఆ దేశంతో బలమైన సంబంధాలను కోరుతూ ఆదివారం బ్రాంప్టన్‌లో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించింది. పలువురు భారతీయ ప్రవాసులు తమ వాహనాల్లో భారత జాతీయ జెండాతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇటీవల అక్కడి భారతీయ సమాజం ఖలీస్థానీల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో భారత ప్రవాసులు ఖలీస్థానీల విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. ఇక ఖలీస్థానీల నుంచి బెదిరింపుల విషయమై భారత ప్రభుత్వం కూడా వారం రోజుల క్రితం కెనడా సర్కార్‌ను భారత ప్రవాసుల భద్రతను కాపాడాల్సిందిగా కోరింది. 


కాగా, భారత ప్రవాసులు కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు మద్దతుగా తిరంగ ర్యాలీ నిర్వహించడంతోనే ఖలీస్థానీ గ్రూపు అక్కడి భారతీయ సమాజంపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక భారత ప్రవాసులపై బెదిరింపుల విషయమై వెంటనే స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ).. కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తమ పౌరుల భద్రతను నిర్ధారించాల్సిందిగా కోరింది. ఎంఈఏ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవా మాట్లాడుతూ..'ఖలీస్థానీ గ్రూపు నుంచి కెనడాలో భారతీయ సమాజం బెదిరింపులను ఎదుర్కొన్నట్లు తెలియడంతో వెంటనే ఒట్టావా, ఢిల్లీలోని కెనడియన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారికి రక్షణ కల్పించాల్సిందిగా కోరాం. అలాగే ఎవరైతే భారత ప్రవాసులు బెదిరింపులు ఎదుర్కొన్నారో వారిని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించాం' అని అన్నారు.

Updated Date - 2021-03-02T20:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising