ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

365 days service: దుబాయ్‌లోని భారత కాన్సులేట్ తొలి వార్షికోత్సవం

ABN, First Publish Date - 2021-08-03T15:37:31+05:30

ప్రవాసులకు అత్యావసర సేవలను మరింత చేరువ చేసేందుకు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ గతేడాది ఆగస్టు 1న '365 డేస్ సర్వీస్' పేరిట కొత్త సర్వీసును తీసుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: ప్రవాసులకు అత్యావసర సేవలను మరింత చేరువ చేసేందుకు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ గతేడాది ఆగస్టు 1న '365 డేస్ సర్వీస్' పేరిట కొత్త సర్వీసును తీసుకొచ్చింది. ఆగస్టు 1తో ఈ సేవలకు ఏడాది పూర్తైన సందర్భంగా ఆదివారం కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తొలి వార్షికోత్సవం నిర్వహించింది. ఏడాది పొడువునా, వారంలో ఏడు రోజులు, రోజుకు 24 గంటలు '365 డేస్ సర్వీస్' ద్వారా సేవలు అందించింది. వీకెండ్స్, సెలవు రోజుల్లో కూడా ఈ సర్వీస్ కొనసాగింది. 2020, ఆగస్టు 1న దుబాయ్‌కు కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డా. అమన్ పూరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


దుబాయ్‌లోని భారత సమాజానికి 24/7 అత్యావసర సేవలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ '365 డేస్ సర్వీస్'కు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వీకెండ్స్, హాలీడేస్‌లో కూడా ప్రవాసులకు ఎమర్జెన్సీ సర్వీసులు అందించడం జరిగిందని ఈ సందర్భంగా అమన్ పూరి అన్నారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో కాన్సులేట్ కార్యాలయాన్ని అత్యావసర సేవల కోసం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సర్వీసును ట్రావెల్ ధృవపత్రాల(పాస్‌పోర్టు, ఎమర్జెన్సీ సర్టిఫికేట్స్, వీసాలు, ఇతర సేవలు) జారీ విషయంలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం విస్తరించునున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-08-03T15:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising