ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ సహాయక చర్యల్లో భారతీయ సమాజం పాత్ర భేష్

ABN, First Publish Date - 2021-08-16T14:39:02+05:30

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలో కొవిడ్ 19 సహాయక చర్యల్లో యూఏఈలోని భారతీయ సమాజం స్థానిక అధికారులకు అండగా నిలిచింది. కరోనా సహాయక చర్యల్లో భారతీయ స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలో కొవిడ్ 19 సహాయక చర్యల్లో యూఏఈలోని భారతీయ సమాజం స్థానిక అధికారులకు అండగా నిలిచింది. కరోనా సహాయక చర్యల్లో భారతీయ సమాజం పాలుపంచుకోవడం అభినందనీయం అని దుబాయిలోని భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ అమన్ పూరి హర్షం వ్యక్తం చేశారు. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దుబాయిలోని కాన్సులేట్ కార్యాలయ ప్రాంగణంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు.



అంతేకాకుండా దుబాయితో యూఏఈలో నివసిస్తున్న భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట సంబరాలను మార్చిలోనే ప్రారంభించినట్టు చెప్పారు. ఇందులో భాగంగానే రకరకాల కార్యక్రమాలను నిర్వహించినట్టు వివరించారు. కాన్సులేట్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో పరిమిత సంఖ్యలో ఇండియన్ కమ్యూనిటీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అజ్మన్‌లోని ఇండియన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రూప్ సిద్ధు మాట్లాడుతూ.. కొవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆరోగ్య మంత్రిత్వశాఖకు సహకరించినట్టు చెప్పారు. తమ ఆధ్వర్యంలో సుమారు 6లక్షల  యూఏఈ నివాసితులకు వ్యాక్సిన్ వేయించినట్టు వెల్లడించారు. 


Updated Date - 2021-08-16T14:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising