ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగ్జామ్‌లో చీటింగ్ చేస్తే అడ్డంగా బుక్కవుతారు.. యూఏఈలో 12 ఏళ్ల విద్యార్థి అద్భుత ఆవిష్కరణ

ABN, First Publish Date - 2021-06-14T17:22:50+05:30

ఇండియాకు చెందిన 12ఏళ్ల విద్యార్థి యూఏఈలో అద్భుతం చేశాడు. పరీక్షల్లో విద్యార్థులు మోసాలకు పాల్పకుండా ఉండేందుకు యాంటి చీటింగ్ గార్డ్‌ను అభివృద్ధి చేశాడు. ఈ క్రమంలో సదరు విద్యార్థిపై పలువురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్జా: ఇండియాకు చెందిన 12ఏళ్ల విద్యార్థి యూఏఈలో అద్భుతం చేశాడు. పరీక్షల్లో విద్యార్థులు మోసాలకు పాల్పకుండా ఉండేందుకు యాంటి చీటింగ్ గార్డ్‌ను అభివృద్ధి చేశాడు. ఈ క్రమంలో సదరు విద్యార్థిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేస్తోంది. దీంతో విద్యాలయాలు మూతపడ్డాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌లో తరగతులకు హారవుతూ.. అంతర్జాలంలోనే పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులపై ఇన్విజిలేటర్ల పర్యవేక్షణ కరువవుతోంది. దీంతో విద్యార్థులు మోసాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



ఆన్‌లైన్‌లో పరీక్షలకు హాజరైనప్పుడు విద్యార్థులు చీటింగ్‌కు పాల్పడకుండా ఉండేందుకు.. షార్జాలోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ఆరుష్ రజని అనే 12ఏళ్ల అబ్బాయి జావా స్క్రిప్ట్‌ ద్వారా యాంటి చీటింగ్ గార్డును రూపొందించాడు. పరీక్ష సమయంలో విద్యార్థులు.. కంప్యూటర్‌లో ఇతర వెబ్‌సైట్‌లను ఓపెన్ చేసినా లేదా ఇతర డాక్యూమెంట్‌లను చూసినా.. తాను రూపొందించిన ఈ యాంటి చీటింగ్ గార్డు మెయిల్ ద్వారా ఇన్విజిలేటర్‌ను అలర్ట్ చేస్తుందని ఆరుష్ వెల్లడించాడు. దీంతో విద్యార్థులు మోసాలకు పాల్పడకుండా అడ్డుకట్ట పడుతుందని ఆరుష్ అభిప్రాయపడ్డాడు. యాంటి చీటింగ్ గార్డు.. విద్యార్థులపై నిఘా నేత్రంలా పని చేస్తుందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఆరుష్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


Updated Date - 2021-06-14T17:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising