ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bahrain కింగ్‌కు భారత చిత్రకారిణి వెరైటీ గిఫ్ట్.. అదిరిపోయిందంతే!

ABN, First Publish Date - 2021-12-19T14:51:27+05:30

50వ నేషనల్ డేను పుష్కరించుకుని భారత చిత్రకారిణి జీనా నియాజ్ బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు వెరైటీ గిఫ్ట్ అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనామా: 50వ నేషనల్ డేను పుష్కరించుకుని భారత చిత్రకారిణి జీనా నియాజ్ బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు వెరైటీ గిఫ్ట్ అందించారు. కింగ్ చిత్రపటాన్ని ఆమె పూసలతో రూపొందించారు. దీనికోసం జీనా మొత్తం 70వేల పూసల్ని వినియోగించారు. క్రీమ్, బ్లాక్ కలర్ పూసలను ఉపయోగించి ఆరు అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పుతో ఈ చిత్రపటాన్ని రూపొందించారామె. 12 రోజుల్లో 71 గంటల పాటు శ్రమించి ఈ చిత్ర పటాన్ని తయారు చేసినట్లు ఆమె తెలిపారు. తాజాగా ఈ చిత్రపటాన్ని గలాలీలోని దిల్మునియా ఐలాండ్‌లో ఉన్న మాల్ ఆఫ్ దిల్మౌనియాలో ప్రదర్శనకు ఉంచారు. వలసదారుల తరఫున కింగ్ హమాద్‌కు ఈ వెరైటీ బహుమానం అందించినట్లు ఈ సందర్భంగా చిత్రకారిణి జీనా నియాజ్ పేర్కొన్నారు. 


ఇక ఇప్పటికే తన ఆర్ట్ వర్క్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన జీనా.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. చిన్నప్పటి నుంచి గల్ఫ్‌లోనే ఉంటున్న జీనా.. బహ్రెయిన్ రావడానికి ముందు పదేళ్ల పాటు సౌదీ అరేబియాలో ఉన్నట్లు తెలియజేశారు. గణితం బోధించే జీనా ప్రస్తుతం బహ్రెయిన్ బ్రెయిన్‌క్రాఫ్ట్ అకాడమీలో పని చేస్తున్నారు. ఒకవైపు టీచర్‌గా కొనసాగుతూనే మరోవైపు ఆర్ట్‌పై తనకున్న మక్కువను ఇలా అప్పుడప్పుడు బయటపెడుతున్నారు. ప్రస్తుతం హిద్ద్‌లో నివాసం ఉంటున్న జీనా దంపతులకు ముగ్గురు పిల్లలు అజ్మల్, అన్హర్, అయేషా ఉన్నారు. 

Updated Date - 2021-12-19T14:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising