ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత సంతతి పోలీసు అధికారిపై కాల్పులు.. పరిస్థితి విషమం..!

ABN, First Publish Date - 2021-11-09T04:05:50+05:30

ఓ ఇంట్లో గొడవ జరుగుతోందన్న సమాచారంతో విషయం తెలుసుకునేందుకు వెళ్లిన ఓ భారత సంతతికి చెందిన అమెరికా పోలీసు అధికారిపై నిందితుడు కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. జార్జియా రాష్ట్రంలో గత వారం ఈ దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఓ ఇంట్లో గొడవ జరుగుతోందన్న సమాచారంతో విషయం తెలుసుకునేందుకు వెళ్లిన ఓ భారత సంతతికి చెందిన అమెరికా పోలీసు అధికారిపై నిందితుడు కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. జార్జియా రాష్ట్రంలో గత వారం ఈ దారుణం జరిగింది. కాల్పుల్లో గాయపడ్డ పోలీసు అధికారి పరమహంస దేశాయ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుడి వివరాలు తెలిపిన వారికి భారీ నజరానా ప్రకటిస్తామని అక్కడి పోలీసు డిపార్ట్‌మెంట్ ప్రముఖ ఎన్‌బీఏ క్రీడాకారుడు షకీల్ ఓ నీల్ ప్రకటించారు. హెన్రీ కౌంటీ పోలీసు డిపార్ట్‌మెంట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టు  సమాచారం అందడంతో పరమహంస్ అక్కడికి వెళ్లినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జోర్డాన్ జాక్సన్ అనే యువకుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తుండగా అతడు పరమహంసపై కాల్పులు జరిపి పారిపోయినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-11-09T04:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising