ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫస్ట్ లేడీ టీంలో భారతీయురాలికి చోటు !

ABN, First Publish Date - 2021-01-15T19:15:30+05:30

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ భార్య, కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్ బృందంలో ఓ భారతీయురాలికి కీలక పదవి దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ భార్య, కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్ బృందంలో మరో భారతీయురాలికి కీలక పదవి దక్కింది. భారత సంతతి గరిమా వర్మను జిల్ డిజిటల్ డైరెక్టర్‌గా నియమించినట్లు బైడెన్ ట్రాన్సిషన్ టీం గురువారం వెల్లడించింది. అలాగే ఫస్ట్ లేడీ కార్యాలయానికి సంబంధించిన ఇతర కొన్ని నియామకాలు కూడా జరిగాయి. వీటిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రోరే బ్రోసియస్, ప్రెస్ సెక్రటరీగా మైఖేల్ లారోసా నియమితులయ్యారు. కాగా, ఇండియాలో పుట్టిన గరిమా వర్మ.. ఒహియో, సెంట్రల్ వ్యాలీ ఆఫ్ కాలిఫోర్నియాలో పెరిగారు. ఇంతకుముందు ఆమె బిడెన్-హారిస్ ఎన్నికల ప్రచారంలో కంటెంట్ వ్యూహకర్తగా పనిచేశారు. అలాగే ఫిల్మ్ మార్కెటింగ్‌లో కూడా వర్మకు ప్రవేశం ఉంది. వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన ఏబీసీ నెట్‌వర్క్‌ టెలివిజన్‌లో పని చేశారు. ఇక ఇప్పటికే బైడెన్, జిల్ టీమ్స్‌లో పలువురు భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు దక్కిన విషయం తెలిసిందే.         

Updated Date - 2021-01-15T19:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising