ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార‌తీయ అమెరిక‌న్‌ జర్నలిస్టుకు ప్రతిష్ఠాత్మక పులిట్జర్‌ పురస్కారం

ABN, First Publish Date - 2021-06-13T13:36:12+05:30

అమెరికాలోని భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్‌కు ప్రతిష్ఠాత్మక పులిట్జర్‌ పురస్కారం లభించింది. బజ్‌ఫీడ్‌ న్యూస్‌ సంస్థలో పని చేస్తున్న ఆమె, చైనాలోని షింజియాంగ్‌ ప్రాంతంలో ముస్లింలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. చైనా నిర్వహిస్తున్న నిర్బంధ శిబిరాలను వ్యక్తిగతంగా పరిశీలించిన తొలి జర్నలిస్టు మేఘానే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముస్లింలపై చైనా అకృత్యాలను బయటపెట్టిన మేఘ రాజగోపాలన్‌

న్యూయార్క్‌: అమెరికాలోని భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్‌కు ప్రతిష్ఠాత్మక పులిట్జర్‌ పురస్కారం లభించింది. బజ్‌ఫీడ్‌ న్యూస్‌ సంస్థలో పని చేస్తున్న ఆమె, చైనాలోని షింజియాంగ్‌ ప్రాంతంలో ముస్లింలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. చైనా నిర్వహిస్తున్న నిర్బంధ శిబిరాలను వ్యక్తిగతంగా పరిశీలించిన తొలి జర్నలిస్టు మేఘానే కావడం గమనార్హం. ఆ వివరాలను బజ్‌ఫీడ్‌ సంస్థ వెల్లడించింది. చైనా మేఘ నోరు నొక్కేందుకు య త్నించిందని, కానీ ఆమె పట్టుదలతో లండన్‌ నుంచి  పరిశోధనను కొనసాగించి, ముస్లింలపై చైనా ప్రభుత్వ దారుణాలను ఎండగట్టారని సంస్థ వివరించింది.


పులిట్సర్‌ పురస్కారం తనకు వస్తుందని ఏ మాత్రం ఊహించలేదని మేఘ చెప్పారు. తన వృత్తి నిర్వహణలో సాయంగా నిలిచిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మేఘతో పాటు టంపా బే టైమ్స్‌లో పని చేసే భారత సంతతి వ్యక్తి నీల్‌ బేడీకి కూడా పులిట్సర్‌ వరించింది. భవిష్యత్తులో నేరస్థులయ్యే వారిని చిన్నతనంలోనే గుర్తించేందుకు పాస్కో కౌంటీలో షరీఫ్‌ కార్యాలయం రూపొందించిన కార్యక్రమాన్ని బహిర్గతం చేసినందుకు బేడీకి పురస్కారం దక్కింది.

Updated Date - 2021-06-13T13:36:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising