ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు అండగా నేను సైతం అంటున్న రుచికా తల్వార్

ABN, First Publish Date - 2021-05-09T06:10:42+05:30

కరోనా పోరాడుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసులు కూడా మేము సైతం అంటూ మాతృదేశానికి బాసటగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెన్సిల్వేనియా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా పోరాడుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసులు కూడా మేము సైతం అంటూ మాతృదేశానికి బాసటగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెన్సిల్వేనియా యూనివర్సిటిలో ఫిజీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్న రుచికా తల్వార్ (28) విరాళాలు సేకరిస్తూ తద్వారా సమకూరిన డబ్బుతో ఇండియాకు  వైద్య పరికరాలను పంపిస్తున్నారు. విరాళాల రూపంలో ఇప్పటి వరకు సుమారు 5లక్షల డాలర్లను సమకూరినట్టు ఇన్‌స్ట్రాగ్రాం ద్వారా వెల్లడించారు. విరాళాల ద్వారా సేకరించిన డబ్బుతో ఇండియాలోని ఆసుపత్రులకు ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇండియాకు పంపిన వైద్య పరికరాలకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె తన ఫాలోవర్లతో పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతలకు కూడా వైద్య పరికరాలను చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా తనను నమ్మి.. విరాళాలు అందిస్తున్న దాతలకు రుచికా తల్వార్ ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2021-05-09T06:10:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising