ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిన్సినాటి మేయర్ బరిలో భారత సంతతి వ్యక్తి!

ABN, First Publish Date - 2021-01-17T15:14:42+05:30

భారతీయ అమెరికన్ లాయర్, డెమోక్రటిక్ నేత అఫ్తాబ్ పురెవాల్‌కు సిన్సినాటి మేయర్ అభ్యర్థిత్వం ఖరారైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారతీయ అమెరికన్ లాయర్, డెమోక్రటిక్ నేత అఫ్తాబ్ పురెవాల్‌కు సిన్సినాటి మేయర్ అభ్యర్థిత్వం ఖరారైంది. అఫ్తాబ్ ఈ విషయాన్ని తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హామిల్టన్ కౌంటీ కోర్టు క్లర్క్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలోని పెద్ద నగరాలలో ఒకటైన సిన్సినాటిలో కరోనా వల్ల అస్తవ్యస్తమైన ప్రజల స్థితిగతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా అఫ్తాబ్ హామీ ఇచ్చారు. "ప్రస్తుతం దేశం కఠిన పరిస్థితిలో ఉంది. అలాగే సిన్సినాటి కూడా. కనుక మేయర్ అభ్యర్థిగా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంతో పాటు వాటి ఫలితాలను ప్రతి పౌరుడికి అందేలా చూస్తాను. కరోనాతో దెబ్బతిన్న ప్రజలకు ఆర్థిక సాయం అందడం వల్ల ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది." అని అఫ్తాబ్ అన్నారు. కాగా, అఫ్తాబ్ పేరెంట్స్ 1980లో భారత్ నుంచి ఒహియోలోని జెనియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇక 2018లో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేసిన అఫ్తాబ్ ఓటమి చవిచూశారు.    

Updated Date - 2021-01-17T15:14:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising