ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హబ్‌స్పాట్‌కు సీఈఓగా భారతీయురాలు

ABN, First Publish Date - 2021-08-10T16:23:51+05:30

అగ్రరాజ్యం అమెరికాలోని ఓ ప్రముఖ సంస్థకు భారతీయ అమెరికన్ మహిళ తాజాగా సీఈఓగా నియమితులయ్యారు. సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో పేరొందిన హబ్‌స్పాట్‌కు సీఈఓగా భారతీయురాలు యామిని రంగన్ ఎన్నికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని ఓ ప్రముఖ సంస్థకు భారతీయ అమెరికన్ మహిళ సీఈఓగా నియమితులయ్యారు. సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో పేరొందిన హబ్‌స్పాట్‌కు సీఈఓగా భారతీయురాలు యామిని రంగన్ ఎన్నికయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కో‌కు చెందిన యామిని.. బ్రియాన్ హల్లిగాన్ స్థానంలో సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రియాన్ గత 15 ఏళ్లుగా ఈ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉండనున్నారు. ఇక గతేడాది చీఫ్ కస్టమర్ ఆఫీసర్‌గా పదొన్నతి పొందిన యామిని.. ఈ ఏడాది సీఈఓగా నియామకం కావడం విశేషం. సెప్టెంబర్ 7న ఆమె అధికారికంగా ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, డ్రాప్‌బాక్స్‌ సంస్థలో పనిచేసి మానేసిన తర్వాత యామిని 2020 జనవరిలో హబ్‌స్పాట్‌ కంపెనీలో చేరారు. 2019లో ఆమె శాన్ ఫ్రాన్సిస్కో బిజినెస్ టైమ్స్ ద్వారా బిజినెస్‌లో అత్యంత ప్రభావవంతమైన మహిళలలో ఒకరిగా గుర్తింపు పొందారు.      

Updated Date - 2021-08-10T16:23:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising