ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరంగ ర్యాలీలో ఖలీస్థానీల హల్‌చల్.. స్పందించిన భారత్!

ABN, First Publish Date - 2021-03-05T22:02:35+05:30

కెనడాలోని భారతీయ సమాజం చేపట్టిన తిరంగ ర్యాలీలో ఖలీస్థాన్ మద్దతుదారులు హల్‌చల్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో భారత్ స్పందించింది. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేయడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒట్టావా: కెనడాలోని భారతీయ సమాజం చేపట్టిన తిరంగ ర్యాలీలో ఖలీస్థాన్ మద్దతుదారులు హల్‌చల్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో భారత్ స్పందించింది. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఖలీస్థానీల నుంచి భారతీయ సమాజానికి రక్షణ కల్పించాలని కోరింది. వివరాల్లోకి వెళితే.. కెనడా-భారత్ మధ్య బలమైన సంబంధాలను ఆకాంక్షిస్తూ కొందరు ప్రవాస భారతీయులు గత నెల 28న బ్రాంప్టన్‌లో తిరంగ ర్యాలీ నిర్వహించారు. పదుల సంఖ్యలో ప్రవాస భారతీయులు తమ వాహనాల్లో భారత జాతీయ జెండాతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఖలీస్థాన్ మద్దతుదారులు కొందరు ఈ ర్యాలీని అడ్డగించి.. హచ్‌చల్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న వారితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. జాతీయ జెండాను అవమానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 



దీంతో భారత్ స్పందించింది. ఘటన నిరసన వ్యక్తం చేస్తూ.. గ్లోబల్ ఆఫైర్స్ కెనెడా డైరెక్టర్ జనరల్‌కు ఒట్టావాలోని ఇండియన్ హై కమిషన్ లేఖ రాసింది. ఫిబ్రవరి 28న చోటు చేసుకున్న ఘటనపై తక్షణం విచారణ జరిపించాలని కోరింది. అంతేకాకుండా కెనడాలో నివసిస్తున్న భారతీయుల రక్షణకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలకు హాని కలించే ఉద్దేశంతో దీన్ని ప్రోత్సహించి ఉండొచ్చని అభిప్రాయపడింది. దీనిపై కూడా దర్యాప్తు చేయాలని సూచించింది. అంతేకాకుండా ఈ ఘటనకు కారణమైన ఖలీస్థాన్ మద్దతుదారులపై తీసుకున్న చర్యలను తెలియజేయాలని లేఖలో ఇండియన్ హై కమిషన్ కోరింది. 


Updated Date - 2021-03-05T22:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising