ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌదీతో త్వరలో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం

ABN, First Publish Date - 2021-08-06T02:52:22+05:30

భారత ప్రభుత్వ కీలక విషయం తెలిపింది. సౌదీ అరేబియాతో ఎయిర్ బబుల్ కుదుర్చుకోవడం కోసం జరుగుతున్న చర్చలు ముగింపు దశకు వచ్చినట్టు వెల్లడించింది. త్వరలోనే సౌదీ-భారత్ మధ్య ఎయిర్ బబుల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ కీలక విషయం తెలిపింది. సౌదీ అరేబియాతో ఎయిర్ బబుల్ కుదుర్చుకోవడం కోసం జరుగుతున్న చర్చలు ముగింపు దశకు వచ్చినట్టు వెల్లడించింది. త్వరలోనే సౌదీ-భారత్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం కుదురుతుందని కేంద్ర మంత్రి వీ. మురళీధరన్ పార్లమెంట్‌లో వెల్లడించారు. పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పందించి ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. కాగా.. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో ఒకదేశానికి మరో దేశానికి రాకపోకలు నిలిచిపోయాయి. భారత్‌ కూడా అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. తాజాగా ఆ రద్దు గడువును ఆగస్టు 31 వరకు కూడా పొడిగించింది. అయితే పరిస్థితులు కాస్త మెరుగుపడటం, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం.. ఒప్పంద ప్రాతిపదికన పలు దేశాలకు విమాన సర్వీసులను గతంలో పునరుద్ధరించింది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియాతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. అమెరికా, బ్రిటన్, కెనడా, ఖతార్, ఫ్రాన్స్, జర్మనీ, ఆఫ్గానిస్థాన్, మాల్దీవులు, యూఏఈ తదితర 28 దేశాలతో ఇప్పటికే భారత ప్రభుత్వం ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది. 


Updated Date - 2021-08-06T02:52:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising