ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీబీఎం: గల్ఫ్ దేశాలకు 68 శాతం విమానాలు కేటాయింపు

ABN, First Publish Date - 2021-03-07T14:16:06+05:30

కరోనా మహమ్మారి వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం 'వందే భారత మిషన్'(వీబీఎం) చేపట్టిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం 'వందే భారత మిషన్'(వీబీఎం) చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రభుత్వం వీబీఎం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 1 నుంచి 28 వరకు మొత్తం 1,350 రిపాట్రియేషన్ విమానాలు నడపనున్నట్లు పేర్కొంది. 28 దేశాల నుంచి సుమారు 2.60 లక్షల మంది భారత ప్రవాసులను స్వదేశానికి తీసుకురానున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. వీటిలో అత్యధికంగా 920 విమానాలు అంటే 68 శాతం ఫ్లైట్స్‌ను గల్ఫ్ దేశాలకు నడపనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 150 విమానాలు ఉత్తర అమెరికా నుంచి, 120 బ్రిటన్, యూరప్ నుంచి, సుమారు 100 ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి, 50 భారత పొరుగు దేశాలకు నడపనున్నట్లు శ్రీవాస్తవ తెలియజేశారు. కాగా, గతేడాది మే 6న ప్రారంభమైన వీబీఎం ద్వారా ఇప్పటి వరకు సుమారు 61.5 లక్షల మందిని స్వదేశానికి తరలించామన్నారు.  

Updated Date - 2021-03-07T14:16:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising