ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహోద్యోగులను గౌరవించకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తా: సిబ్బందికి జో బైడెన్ హెచ్చరిక

ABN, First Publish Date - 2021-01-21T21:28:53+05:30

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం అధ్యక్ష నియామకాల కోసం ఏర్పాటు చేసిన వర్చువల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జో బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనతో పాటు పనిచేయబోయే సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. ‘సహోద్యోగులకు గౌరవం ఇవ్వడం లేదని తెలిస్తే అక్కడికక్కడే ఉద్యోగం నుంచి తొలగిస్తా. నేను జోక్ చేయడం లేదు. ఒకవేళ మీరు నాతో పనిచేస్తూ మరో సహోద్యోగిని కించపరచడం లేదా అగౌరవపరిచినట్టు తెలిస్తే వెంటనే విధుల నుంచి మిమ్మల్ని తొలగిస్తాను. కారణాలు చెప్పే అవకాశం కూడా ఇవ్వను. 


ప్రపంచంలోనే అత్యంత సభ్యమైన ప్రభుత్వంతో మీరు పనిచేస్తున్నారు. నాతో పాటు పనిచేయబోయే సిబ్బంది నుంచి నేను ఆశించేది కేవలం నిజాయితీ, మర్యాద మాత్రమే. మనమంతా కలిసి ఈ దేశ ఆత్మను తిరిగి పునరుద్దరించాలి’అంటూ జో బైడెన్ సిబ్బందితో చెప్పారు. కాగా.. బుధవారం వరకు అధ్యక్షుడిగా కొనసాగిన ట్రంప్ ప్రస్తుతం ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లో నివసిస్తున్నారు. ఇక మీదట ట్రంప్ అక్కడే జీవించనున్నారు.   

Updated Date - 2021-01-21T21:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising