ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతడి ఇంట్లో మాంసపు ముద్దలు.. నెత్తురుతో తడిసిన గిన్నె.. నిందితుడు చెప్పింది విని పోలీసులకు భారీ షాక్..!

ABN, First Publish Date - 2021-12-22T00:56:09+05:30

ఆ ఇంట్లో అక్కడక్కడా రక్తం మరకలు.. నెత్తురుతో తడిసిన ఓ గిన్నె.. నేలపై పడ్డ మాంసపు ముద్దలు.. ఓ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసేందుకు అతడి ఇంటికి వెళ్లిన పోలీసులకు కనిపించిన సీన్ ఇది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఇంట్లో అక్కడక్కడా రక్తం మరకలు.. నెత్తురుతో తడిసిన ఓ గిన్నె.. నేలపై పడ్డ మాంసపు ముద్దలు.. ఓ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసేందుకు అతడి ఇంటికి వెళ్లిన పోలీసులకు కనిపించిన సీన్ ఇది. అమెరికాలోని ఐడాహో రాష్ట్రంలోని బానర్ కౌంటీలో సెప్టెంబర్ 10న జరిగిందీ ఘటన. అప్పటికి పోలీసులు దీన్ని ఓ హత్య కేసుగానే భావించారు. నిందితుడు డేవిడ్ రస్సల్‌తో పొరిగింటి వ్యక్తి డేవిడ్ ఫ్లాజెట్‌కు కొన్ని గొడవలు ఉన్నట్టు వారికి తెలిసింది. ఈ నేపథ్యంలో డేవిడ్ ఫ్లాజెట్ హత్యకు గురయ్యాడు.. దీంతో నిందితుడిపై పోలీసులు తొలుత హత్య కేసు మాత్రమే నమోదు చేశారు. అతడి ఇంట్లో లభించిన మాంస ఖండాలు డేవిడ్‌వని రుజువైంది.


ఆ తరువాత...అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించిన కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘మనిషి మెదడు తింటే నా మెదడులోని సమస్యలన్నీ నయమైపోతాయని నా నమ్మకం’’ అని నిందితుడు ఇటీవల చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు. దీంతో..అతడిపై నరమాంసభక్షణ నేరం కింద కూడా కేసు నమోదు చేశారు. తమ జీవితంలో ఇటువంటి ఘటన చూడలేదని ఈ కేసును విచారిస్తున్న కొందరు అధికారులు వ్యాఖ్యానించారు. ఆసలు ఆ రోజు ఏం జరిగిందో.. నిందితుడు ఎటువంటి దారుణానికి పాల్పడ్డాడ్డో తమకు ఎప్పటికీ తెలియకపోవచ్చని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో ఇటువంటి కేసు నమోదవడం ఇదే తొలిసారని అక్కడి మీడియా చెబుతోంది. ఈ కేసు ఐడాహోలో పెను సంచలనానికి దారితీసింది. 

Updated Date - 2021-12-22T00:56:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising