ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి కోసం వెళ్లి Omanలో బందీగా మారిన హైద్రాబాద్ మహిళ.. రక్షించాలంటూ భర్త వేడుకోలు!

ABN, First Publish Date - 2021-12-17T13:07:28+05:30

ఉద్యోగం కోసం వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్‌లోని ఓ ఇంట్లో చాకిరీ చేస్తూ బందీగా మారిన మహిళ ఉదంతం వెలుగు చూసింది. పాతనగర శివారు ప్రాంతానికి చెందిన ఫిర్దోజ్‌బేగం ఉద్యోగం ఏజెంట్లుగా ఉన్న అస్మాబేగం, ఆమె భర్త మోసిన్‌, మరో ఏజెంట్‌ మహ్మద్‌లను సంప్రదించింది. ఒమన్‌లోని ఫరీదాబేగం కుటుంబంలో చిన్నారిని సంరక్షించే ఉద్యోగం ఉందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒమన్‌లో చిక్కుకున్న మహిళ

రక్షించాలంటూ విదేశాంగ శాఖకు లేఖ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగం కోసం వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్‌లోని ఓ ఇంట్లో చాకిరీ చేస్తూ బందీగా మారిన మహిళ ఉదంతం వెలుగు చూసింది. పాతనగర శివారు ప్రాంతానికి చెందిన ఫిర్దోజ్‌బేగం ఉద్యోగం ఏజెంట్లుగా ఉన్న అస్మాబేగం, ఆమె భర్త మోసిన్‌, మరో ఏజెంట్‌ మహ్మద్‌లను సంప్రదించింది. ఒమన్‌లోని ఫరీదాబేగం కుటుంబంలో చిన్నారిని సంరక్షించే ఉద్యోగం ఉందని, జీతం భారత కరెన్సీలో రూ. 22వేలు చెల్లిస్తారని చెప్పి ఆమెను గతనెల 19న మస్కట్‌ నగరానికి పంపించారు. అక్కడ లక్ష్మి అనే మరో మహిళా ఏజెంట్‌ ఫిర్దోజ్‌బేగంను కలిసి మరుసటి రోజు మస్కట్‌కు 150 కి.మీ. దూరంలో ఉన్న సుర్‌ అనే ప్రాంతంలో ఓ కుటుంబానికి అప్పగించింది. వారు ప్రతిరోజూ 15 నుంచి 18 గంటలపాటు పాచి పని చేయించేవారు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. తనను వెనక్కి పంపించమని అక్కడి ఏజెంట్లను వేడుకుంటే, అస్మాబేగం, ఆమె భర్తకు రూ.2లక్షలు చెల్లిస్తేనే వెనక్కి పంపిస్తా మంటూ షరతు విధించారు. దీంతో ఫిర్దోజ్‌బేగం భర్త ఆందోళనకు గురై ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్‌ను ఆశ్రయించాడు. ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు లేఖ రాస్తూ ఒమన్‌లో చిక్కుకున్న మహిళను రక్షించాలని ఆమెకు సంబంధించిన వివరాలు పంపించారు. 

Updated Date - 2021-12-17T13:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising