ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయిలో చిక్కుకున్న హైదరాబాద్ పర్యాటకులు

ABN, First Publish Date - 2021-03-02T14:34:38+05:30

నగరం నుంచి వెళ్లిన 34మంది పర్యాటకులు దుబాయిలో చిక్కుకున్నారు. పెద్దఅంబర్‌పేట నుంచి 8 మంది, ఇతర ప్రాంతాల నుంచి కొందరు కలిసి మొత్తం 34మంది గత నెల 28న ఎల్‌బీనగర్‌ అర్చన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/కొత్తపేట: నగరం నుంచి వెళ్లిన 34మంది పర్యాటకులు దుబాయిలో చిక్కుకున్నారు. పెద్దఅంబర్‌పేట నుంచి 8 మంది, ఇతర ప్రాంతాల నుంచి కొందరు కలిసి మొత్తం 34మంది గత నెల 28న ఎల్‌బీనగర్‌ అర్చన ట్రావెల్స్‌ ద్వారా దుబాయి పర్యటనకు వెళ్లా రు. ట్రావెల్స్‌ వారు అక్కడ ఓ హోటల్‌లో తమను వదిలి వెళ్లిపోయారని సుదర్శన్‌ అనే పర్యాటకుడు సోమవారం రాత్రి కొందరికి వాట్సప్‌ కాల్‌, మెసేజీ పంపారు. ఎల్‌బీనగర్‌ కామినేని-సీరీస్‌ రోడ్డులోని అర్చన ట్రావెల్స్‌ యజమాని బద్దం భోజిరెడ్డికి ఫోన్‌చేసినా స్పందించడం లేదని సైబరాబా ద్‌ కమిషనర్‌కు ట్రావెల్స్‌ యజమానిపై ఫిర్యాదు చేయాలని ఆ పర్యాటకు డు విన్నవించారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎల్‌బీనగర్‌ ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ట్రావెల్స్‌ వద్దకు వెళ్లి విచారించే యత్నం చేయగా ఎవరూ లేరని ఆయన పేర్కొన్నారు. 


తప్పుడు ప్రచారం: బద్దం భోజిరెడ్డి, అర్చన ట్రావెల్స్‌, ఎల్‌బీనగర్‌ యజమాని

దుబాయ్‌కి అర్చన ట్రావెల్స్‌ ద్వారా వెళ్లినవారు ప్రస్తుతం ఫార్చూన్‌ ఆట్రియం హోటల్‌లో ఉన్నారు. మద్యం తాగొద్దని చెప్పడంతో వారిలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుబాయి నిబంధనల ప్రకారం మద్యం తాగితే బయట తిరగరాదు. మద్యం తాగిన కొందరికి హోటల్‌లో ప్రత్యేకంగా బస ఏర్పాటు చేశాం. తక్కువ రేటుకు తాము దుబాయి పర్యటనకు తీసుకెళ్లాం. పర్యటకులు మాల్స్‌లో తిరుగుతున్న వీడియోలు తమకు చేరాయి, వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు.

Updated Date - 2021-03-02T14:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising