ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait Airport కు ప్రయాణికుల తాకిడి.. గడిచిన 5రోజుల్లో ఎంతమంది ప్రయాణించారంటే..!

ABN, First Publish Date - 2021-10-31T14:07:44+05:30

కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం గత ఆదివారం నుంచి పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం గత ఆదివారం నుంచి పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్న విషయం తెలిసిందే. దీంతో గడిచిన ఐదు రోజుల్లో ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. ఈ ఐదు రోజుల్లో ఏకంగా 65,759 మంది ప్రయాణికులు కువైత్ విమానాశ్రయం నుంచి రాకపోకలు కొనసాగించినట్లు తాజాగా వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 28,228 మంది అరైవల్స్ ఉంటే.. 31,516 మంది ప్రయాణికులు విమానాశ్రయం నుంచి వేరే గమ్యస్థానాలకు వెళ్లారు. అలాగే మరో 5,015 మంది కువైత్‌ను ట్రాన్సిట్ పాయింట్‌గా ఉపయోగించుకోవడం జరిగింది. ఇక మొత్తం 521 విమానాలు ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు కొనసాగించాయి. వీటిలో 260 ఇన్‌కమింగ్ ఫ్లైట్స్ అయితే, 261 ఔట్‌గోయింగ్ విమానాలు ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 


ఇక రాబోయే రోజుల్లో ప్రయాణికుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆదివారం ముందు వరకు రోజువారీగా కేవలం 10వేల మంది ప్రయాణికులకు మాత్రమే అవకాశం ఉండేది. కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షల్లో భాగంగా డైలీ ప్రయాణికుల సామర్థ్యాన్ని పరిమిత సంఖ్యలో అనుమతించడం జరిగింది. ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితులు చక్కబడడంతో కువైత్ మళ్లీ సాధారణ జీవనంవైపు అడుగులేస్తోంది. దీనిలో భాగంగానే పలు ఆంక్షలను తొలగించింది. అలాగే కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తిరిగి పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపిస్తోంది. ఇన్నాళ్లు విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. 

Updated Date - 2021-10-31T14:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising