ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Abu Dhabi లో కొత్త ట్రాఫిక్ రూల్.. ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే భారీ ఫైన్!

ABN, First Publish Date - 2021-11-06T15:45:53+05:30

యూఏఈ రాజధాని అబుధాబిలో వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. భారీ శబ్ధం చేసే వాహనాలు నడిపితే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానా విధిస్తామని వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: యూఏఈ రాజధాని అబుధాబిలో వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. భారీ శబ్ధం చేసే వాహనాలు నడిపితే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానా విధిస్తామని వెల్లడించారు. ధ్వని కాలుష్యం విపరీతంగా పెరగడంతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా యువత గట్టి శబ్ధాలతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారని తద్వారా ప్రజా జీవనానికి, శాంతికి భంగం కలుగుతుందని తెలిపారు. కనుక ఇకపై నివాస ప్రాంతాల్లో భారీ ధ్వనులతో వాహనాలు నడిపితే 999 నెంబర్‌కు కాల్ చేసి చెప్పాలని సూచించారు. 


ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 20 ప్రకారం ఇలా భారీ శబ్ధాలతో వాహనం నడిపేవారికి 2వేల దిర్హమ్స్(సుమారు రూ.40వేలు) జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. అలాగే అలాంటి వాననం నడిపినందుకు వాహనదారుడి ఖాతాలో 12 బ్లాక్ పాయింట్లు వేస్తారు. వాహనం ఇంజిన్‌ను అనధికారికంగా మార్పులు చేసి ధ్వని కాలుష్యానికి పాల్పడితే ఆర్టికల్ 73 ప్రకారం వెయ్యి దిర్హమ్స్(రూ.20వేలు) ఫైన్, 12 ట్రాఫిక్ పాయింట్లు పడతాయన్నారు. అలాగే వాహనాన్ని 30 రోజులు జప్తు చేయడం జరుగుతుంది. వాహనం జప్తు చేసిన తర్వాత మూడు నెలలలోపు 10వేల దిర్హమ్స్(రూ.2లక్షలు) జరిమానా చెల్లించి వాహనాన్ని విడిపించుకోవాలి. లేనిపక్షంలో వాహనాన్ని వేలం వేయడం జరుగుతుందని ట్రాఫిక్ అధికారులు చెప్పుకొచ్చారు. 


Updated Date - 2021-11-06T15:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising