ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dubai యువరాజు Share చేసిన ఎలుగుబంటి Viral Video.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!

ABN, First Publish Date - 2021-09-05T16:12:32+05:30

సోషల్ మీడియాలో ఓ ఎలుగుబంటికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ ఎలుగుబంటికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ ఎలుగుబంటి ఆహారం కోసం పార్కింగ్‌లో ఉన్న కారులోకి  దూరడం ఉంది. గోదుమ రంగు ఎలుగుబంటి ఇలా కారు కిటికీ ద్వారా లోపలికి వెళ్లడం.. ఆ తర్వాత కొద్దిసేపటికి అదే దారి గుండా బయటకు రావడం వీడియోలో మనం చూడొచ్చు. పార్కింగ్ చేసి ఉన్న ఆ ఎస్‌యూవీ వాహనం కిటికీ అద్దాలు కిందికి దించి ఉండడంతో ఎలుగుబంటి దాని ద్వారా లోపలికి వెళ్లింది. కొద్దిసేపు అందులోనే ఉన్నా తర్వాత అదే కిటికీ గుండా మళ్లీ బయటకు వచ్చింది. 


ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, దుబాయ్ యువరాజు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై తమదైనశైలిలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 'ఒక్కసారి ఊహించుకోండి.. మీ కారు బ్యాక్ సీటులో ఇలాగే ఓ పెద్ద ఎలుగుబంటి మిమ్మల్ని వెల్‌కం చెబితే ఎలా ఉంటదో' అని ఓ ట్వీటర్ యూజర్ కామెంట్ చేస్తే.. 'అచ్చం మనిషిలానే కారులోకి వెళ్లి వచ్చిందిగా' అని మరో ఇన్‌స్టా యూజర్ కామెంట్ పెట్టారు. 'ఎలుగుబంటి వల్ల కారు ధ్వంసమైతే ఇన్సూరెన్స్ కవర్ అవ్వదనుకుంటా' అని మరో నెటిజన్ చమత్కరించారు. ఇలా ఈ వీడియోపై నెటిజన్లు తమదైన ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.     



Updated Date - 2021-09-05T16:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising