ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి.. 100రోజుల తర్వాత..

ABN, First Publish Date - 2021-05-16T14:09:06+05:30

సౌదీ అరేబియాలో మత విశ్వాసాలకు విరుద్ధంగా తన భర్త మృతదేహాన్ని ఖననం చేశారంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు. దీంతో సుమారు వంద రోజుల తర్వాత పూడ్చేసిన మృతదేహా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మత విశ్వాసాలకు విరుద్ధంగా సౌదీలో ఖననం చేశారని ఢిల్లీ హైకోర్టులో పిల్ వేసిన భార్య

రియాద్: సౌదీ అరేబియాలో మత విశ్వాసాలకు విరుద్ధంగా తన భర్త మృతదేహాన్ని ఖననం చేశారంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు. దీంతో సుమారు వంద రోజుల తర్వాత పూడ్చేసిన మృతదేహాన్ని వెలికి తీసి, బుధవారం రోజు ఆ మృతదేహాన్ని సదరు మహిళకు అప్పగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సంజీవ్ కుమార్ (49) దాదాపు 23ఏళ్ల నుంచి సౌదీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 24న అతనికి గుండెపోటు రావడంతో సౌదీ బీష్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించాడు. 



కాగా.. జెడ్డా భారత రాయబార కార్యాలయంలో పని చేసే ఓ ట్రాన్స్‌లేటర్ చేసిన తప్పిదంతో సంజీవ్ కుమార్‌ను ముస్లింగా భావించి, ఆ మత సంప్రదాయాల ప్రకారమే సౌదీలో ఖననం చేశారు. దీంతో సంజీవ్ కుమార్ భార్య అంజూశర్మ న్యాయపోరాటానికి దిగారు. తెలంగాణ ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు భీమ్ రెడ్డి సహాయంతో ఢిల్లీ హైకోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సంజీవ్ కుమార్ మృతదేహాన్ని అంజూశర్మకు స్వాధీన పరచాలని తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో సౌదీలోని అధికారులు.. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని దాదాపు వంద రోజుల తర్వాత తవ్వి తీయించి, కార్గో విమానంలో బుధవారం రోజు ఢిల్లీకి తరలించారు. ఈ నేపథ్యంలో సంజీవ్ కుమార్ మృతదేహాన్ని విదేశాంగశాఖ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోనే అంజూశర్మకు అప్పగించారు. 


Updated Date - 2021-05-16T14:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising