ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్మెట్‌ @ 37 లక్షలు!

ABN, First Publish Date - 2021-06-18T11:05:00+05:30

రాబోయే కొన్ని వారాల్లోనే అమెరికాలో ఓ అద్భుతమైన హెల్మెట్‌ అందుబాటులోకి రానుంది. కెర్నెల్‌ అనే సంస్థ తయారు చేస్తున్న ఈ హెల్మెట్‌ ధర రూ.37 లక్షలు మాత్రమే! దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది మీ మెద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీ ‘మెదడు’ను చదివేస్తుంది

వాషింగ్టన్‌, జూన్‌ 17: రాబోయే కొన్ని వారాల్లోనే అమెరికాలో ఓ అద్భుతమైన హెల్మెట్‌ అందుబాటులోకి రానుంది. కెర్నెల్‌ అనే సంస్థ తయారు చేస్తున్న ఈ హెల్మెట్‌ ధర రూ.37 లక్షలు మాత్రమే! దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది మీ మెదడును చదివేస్తుంది! సెన్సర్ల నెట్లు ఉన్న ఈ హెల్మెట్‌నుపెట్టుకుంటే మెదడులో విద్యుత్‌ ప్రకంపనలు, రక్త ప్రవాహాన్ని వాయువేగంతో కొలవడంతో పాటు విశ్లేషిస్తుంది. ఈ పరిజ్ఞానం చాలా ఏళ్ల నుంచి అందుబాటులో ఉంది. కానీ, ఒక గది అంత పరిమాణంలో ఉండే ఖరీదైన యంత్రాల ద్వారా టెస్టులు చేస్తేనే ఇవన్నీ తెలుస్తాయి. 


రోగులు కూడా గంటల తరబడి ఆస్పత్రుల్లో ఉండాల్సి ఉంటుంది.కెర్నెల్‌ కంపెనీ తయారు చేసే హెల్మెట్‌ అందుబాటులోకి వస్తే ఈ బాధలేమీ ఉండవు. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈ హెల్మెట్‌ను ఎవరైనా ధరించవచ్చని, దీన్ని రూపొందించడానికి ఐదేళ్లు శ్రమించిన బ్రియాన్‌ జాన్సన్‌ తెలిపారు. ఈ హెల్మెట్ల తయారీకి ఆయన ఇప్పటి వరకు దాదాపు రూ.815 కోట్లు ఖర్చు పెట్టారు.


Updated Date - 2021-06-18T11:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising