ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Oman వెళ్తున్నారా?.. అయితే మీరు ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

ABN, First Publish Date - 2021-09-04T15:34:30+05:30

మహమ్మారి కరోనా నేపథ్యంలో ఇప్పటికే గల్ఫ్ దేశాలు పలు ప్రయాణ ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: మహమ్మారి కరోనా నేపథ్యంలో ఇప్పటికే గల్ఫ్ దేశాలు పలు ప్రయాణ ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సుల్తానేట్‌కు వచ్చే వారికి ఒమన్ మరో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. తమ దేశానికి వచ్చే వారికి తప్పకుండా కోవిడ్-19 ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని ప్రకటించింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) సుల్తానేట్‌కు విమానాలు నడిపే విమానయాన సంస్థలకు తాజాగా ఓ సర్క్యూలర్ జారీ చేసింది. "ఒమన్ వచ్చే ప్రయాణికులు కనీసం ఏడాది పాటు కరోనా చికిత్సకు అయ్యే ఖర్చులు కవర్ అయ్యేలా హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం తప్పనిసరి. ఒమన్ పౌరులకు దీని నుంచి మినహాయింపు" అని సీఏఏ తన సర్క్యూలర్‌లో పేర్కొంది.


అయితే, నివాసితులు ఎవరైతే కోవిడ్-19 చికిత్స కవర్ అయ్యేలా ఇప్పటికే పర్సనల్, కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారో వారు కొత్తగా ఆరోగ్య బీమా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఏఏ అధికారులు స్పష్టం చేశారు. ఒమన్‌కు విమానం ఎక్కడానికి ముందు ఇన్సూరెన్స్‌కు సంబంధించిన పత్రాలను ప్రయాణికులు సమర్పిస్తే సరిపోతుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 1 నుంచి అన్నీ మార్గాల్లో ఒమన్ వచ్చేందుకు ఆ దేశ సుప్రీం కమిటీ ప్రవాసులు, సందర్శకులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటివరకు పలు దేశాల విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. దీంతో రెండు మూడు రోజులుగా ఒమన్‌కు విదేశీ ప్రయాణికుల తాకిడి బాగా పెరిగింది.           



Updated Date - 2021-09-04T15:34:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising