ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

H-1B వీసాదారుల భాగస్వాములకు శుభవార్త.. భారతీయ మహిళలకు ప్రయోజనం

ABN, First Publish Date - 2021-11-13T13:10:21+05:30

డిపెండెంట్‌ వీసాలతో తమ దేశంలో ఉంటున్న మహిళలకు అమెరికా శుభవార్త చెప్పింది. వారికి ఆటోమేటిక్‌ వర్క్‌ పర్మిట్లు ఇవ్వడానికి అంగీకరించింది. ఫలితంగా మహిళలు ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ నిర్ణయంతో వేల సంఖ్యలో భారతీయ ప్రొఫెషనల్స్‌ కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిపెండెంట్‌ వీసాలున్న మహిళలకు అమెరికా శుభవార్త 

వాషింగ్టన్: డిపెండెంట్‌ వీసాలతో తమ దేశంలో ఉంటున్న మహిళలకు అమెరికా శుభవార్త చెప్పింది. వారికి ఆటోమేటిక్‌ వర్క్‌ పర్మిట్లు ఇవ్వడానికి అంగీకరించింది. ఫలితంగా మహిళలు ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ నిర్ణయంతో  వేల సంఖ్యలో భారతీయ ప్రొఫెషనల్స్‌ కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. హెచ్‌1బీ వీసాదారుల భార్యలకు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలకు యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎ్‌ససీఐఎస్‌) హెచ్‌4 వీసాను జారీచేస్తుంది. అయితే ఈ వీసా ఉన్నవారు వర్క్‌ పర్మిట్లు వచ్చే వరకు ఉద్యోగాలు చేయడాన్ని నిషేధిస్తూ యూఎ్‌ససీఐఎస్‌ గతంలో నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ .. హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగంతో న్యాయస్థానంలో పోరాడుతోంది. తాజాగా సయోధ్య కుదిరింది. దీన్ని అనుసరించి హెచ్‌4 వీసాలున్న కొన్ని కేటగిరీల మహిళలకు ఆటోమేటిక్‌ వర్క్‌ పర్మిట్లు ఇస్తారు. ఈ వీసాదారుల్లో అత్యధిక శాతం మంది భారతీయ మహిళలే ఉంటారు.

Updated Date - 2021-11-13T13:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising