ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛలో ఢిల్లీకి తరలిన గల్ఫ్‌ జేఏసీ ప్రతినిధుల బృందం

ABN, First Publish Date - 2021-03-07T20:50:50+05:30

ఆరు అరబ్‌ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలను 30 నుంచి 50శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గల్ఫ్‌ వర్కర్స్‌ జూయిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనీస వేతనాల సర్కులర్‌ రద్దు చేయాలని డిమాండ్‌ 

జగిత్యాల అర్బన్‌,  మార్చి 6: ఆరు అరబ్‌ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలను 30 నుంచి 50శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గల్ఫ్‌ వర్కర్స్‌ జూయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో 8 మంది సభ్యుల బృందం ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా గల్ఫ్‌ జేఏసీ కన్వీనర్‌ గుగ్గిల్ల రవిగౌడ్‌ మాట్లాడుతూ కనీస వేతన తగ్గింపు సర్కులర్‌ను వెంటనే రద్దుచేసి పాత వేతనాలను కొన సాగించాలని విజ్ఞప్తి చేసిన కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఈ నెల 8న పార్లమ్టె్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా తాము అన్ని రాష్ట్రాల ఎంపీలను 8,9 తేదీల్లో కలిసి గల్ఫ్‌ కార్మికుల వేతన సమస్యలను వివరించి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.  



వేతన సర్క్యులర్‌ ప్రభావం రాబోయో కాలంలో గల్ఫ్‌ దేశాలలో నివసిస్తున్న 88లక్షల మంది భారతీయ ఉద్యోగుల, కార్మికుల ఆదాయంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని రాష్ట్ర నా యకులు స్వదేశీ పరికిపండ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా సర్క్యులర్‌ను జారీ చేయడం సరైంది కాదన్నారు. ఈ ఆరు అరబ్‌ దేశాలు కనీస వేతనాలను సవరించాలని భారత ప్రభుత్వాన్ని కోరలేదని, రిక్రూట్‌మెంట్‌ ఏజేన్సీలు, విదేశీ కంపెనీ యాజమాన్యాల ఒత్తిళ్ల మేరకే భాతర ప్రభుత్వం తలొగ్గిందని ఖతార్‌ జేఏసీ ప్రతినిధి తోట ధర్మేంధర్‌  ఆరోపించారు.  వెనువెం టనే తగ్గించిన గల్ఫ్‌ కార్మికుల కనీస వేతనాల తగ్గింపు సర్కులర్లు రద్దు చేయాలని వారు డి మాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ బృందంలో మెంగు అనిల్‌, పంది రంజిత్‌, పొన్నం రాజశేఖర్‌, బద్దం వినయ్‌, దాసరి మల్లిఖార్జున్‌, ప్రశాంత్‌, బసంత్‌రెడ్డి తదితరులున్నారు.


Updated Date - 2021-03-07T20:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising