ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న తప్పే.. కానీ భారీ మూల్యం చెల్లించుకుంది..!

ABN, First Publish Date - 2021-12-17T02:43:16+05:30

చిన్న తప్పుకు 69ఏళ్ల మహిళ భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో ఆ ఘటన ప్రస్తుతం స్థానికంగా చ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: చిన్న తప్పుకు 69ఏళ్ల మహిళ భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో ఆ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


బ్రిటన్‌కు చెందిన పమేలా హోమ్స్‌.. కొద్ది రోజుల క్రితం ఆన్‌లైన్‌లో ఓ వస్తువును ఆర్డర్ ఇచ్చింది. తాజాగా ఆ వస్తువు డెలివరీ అయింది. ఈ క్రమంలో ఆమె.. అట్టపెట్టలో వచ్చిన వస్తువును తీసుకుని ఖాళీ డబ్బాను ఇంటి బయటపడేసింది. తన కొడుకు వచ్చాక దాన్ని డస్ట్‌బిన్‌లో వేస్తాడని భావించింది. అయితే.. అక్కడ సీన్ రివర్స్ అయింది. రాత్రి పూట చెకింగ్‌కు వచ్చిన అధికారులు.. పమేలా ఇంటి ప్రాంగణంలో ఖాళీ డబ్బను గుర్తించారు. దీంతో ఉదయాన్నే మరోసారి ఆమె ఇంటికి వచ్చిన అధికారులు ఆమెకు రూ. 40వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. తనను అధికారులు అరెస్ట్ చేస్తారమే అని భయపడ్డట్లు పేర్కొన్నారు. కాగా.. ఇది స్థానికంగా చర్చనీయాంశం అయింది. 




Updated Date - 2021-12-17T02:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising