ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో గొరిల్లాలకు కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2021-01-12T20:39:08+05:30

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మనుషులతో పాటు అనేక మూగజీవులు కూడా కరోనా బారిన పడ్డాయి. అయితే అమెరికాలో మొట్టమొదటిసారిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాండియాగో: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మనుషులతో పాటు అనేక మూగజీవులు కూడా కరోనా బారిన పడ్డాయి. అయితే అమెరికాలో మొట్టమొదటిసారిగా గొరిల్లాలకు కూడా కరోనా సోకింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాండియాగోలో ఉన్న ఓ జూ సఫారి పార్క్‌లో పదుల సంఖ్యలో గొరిల్లాలకు కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు వెంటనే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో గొరిల్లాలకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. జూ సిబ్బందిలోని ఓ వ్యక్తి ద్వారానే గొరిల్లాలకు కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి గొరిల్లాల వద్దకు వెళ్లిన ప్రతిసారి మాస్క్ ధరించాడని, అయినప్పటికి కరోనా సోకిందని తెలిపారు. 


కరోనా పరీక్షల్లో ఆ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అతడి ద్వారానే కరోనా సోకినట్టు నిర్థారించారు. ఇప్పటివరకు గొరిల్లాలకు ఎటువంటి వైద్యం అందించలేదని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. కాగా.. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం డిసెంబర్ ఆరో తేదీ నుంచి లాక్‌డౌన్ విధించింది. అప్పటి నుంచి ఈ జూను కూడా అధికారులు మూసివేసే ఉంచారు.

Updated Date - 2021-01-12T20:39:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising