ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు గూగుల్ భారీ సాయం!

ABN, First Publish Date - 2021-06-18T04:44:30+05:30

ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక ప్రకటన చేసింది. కరోనా సాయం కింద భారత్‌కు రూ.113కోట్లను అందించనున్నట్టు వెల్లడించింది. ఇండియాలో 80 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పడంతోపాటు పలు సంస్థల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక ప్రకటన చేసింది. కరోనా సాయం కింద భారత్‌కు రూ.113కోట్లను అందించనున్నట్టు వెల్లడించింది. ఇండియాలో 80 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పడంతోపాటు పలు సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తల సంఖ్యను పెంచే కార్యక్రమానికి చేపట్టనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగానే గివ్ ఇండియా సంస్థకు రూ.90కోట్లను అలాగే పాత్ సంస్థకు రూ.18.5కోట్లను అందించనున్నట్టు పేర్కొంది. కరోనా నేపథ్యంలో అపోలో మెడ్‌స్కిల్స్‌.. గ్రామీణ ప్రాంతాల్లోని 20వేల మందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అపోలో మెడ్‌స్కిల్స్‌కు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు గూగుల్ వెల్లడించింది.



అంతేకాకుండా దాదాపు 15 రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్మాన్ సంస్థకు రూ.3.6కోట్లను గూగుల్ అందించనుంది. ఈ సందర్భంగా గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ..ప్రజలు సురక్షితంగా ఉండే చూసుకోవడం తమ బాధ్యత అన్నారు. కరోనా సంక్షభం నుంచి భారత్ నెమ్మదిగా బయటపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇండియాలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి గూగుల్ సహకరిస్తుందని ఆయన అన్నారు. 


Updated Date - 2021-06-18T04:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising