ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెల నుంచి బూస్టర్ షాట్స్‌.. ప్రకటించిన ఆరోగ్యశాఖ

ABN, First Publish Date - 2021-08-03T05:30:00+05:30

కరోనా డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న తరుణంలో బూస్టర్ షాట్స్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెర్లిన్: కరోనా డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న తరుణంలో బూస్టర్ షాట్స్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణంగా తీసుకునే రెండు డోసుల వ్యాక్సిన్‌కు అదనంగా మరో డోసు వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ‘బూస్టర్ షాట్’ అంటారు. ఇది తీసుకున్న వారిలో కరోనా యాంటీబాడీలు 11 రెట్లు అధికంగా కనిపించినట్లు కొన్ని పరిశోధనల్లో తేలింది. ఈ క్రమంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి తమ ప్రజలకు బూస్టర్ షాట్స్ ఇవ్వనున్నట్లు జర్మనీ ప్రకటించింది. ఈ మేరకు జర్మనీలోని 16 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు ప్రకటించారు. ఇంతకు ముందు ప్రజలు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా సరే.. బూస్టర్ షాట్‌గా ఫైజర్ లేదా మోడెర్నా వ్యాక్సిన్ అందిస్తామని ఆరోగ్య మంత్రులు వెల్లడించారు. అలాగే 12 నుంచి 17 సంవత్సరాల వయసున్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. కాగా, జర్మనీలో ఇప్పటి వరకూ 37లక్షలపైగా కరోనా కేసులు, 92వేలపైగా కరోనా మరణాలు సంభవించాయి. ఇక్కడ గడిచిన 24 గంటల్లో కొత్తగా 457 కరోనా కేసులు, ఒక కరోనా మరణం నమోదయ్యాయి.

Updated Date - 2021-08-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising