ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్మనీలో కరోనా టీకా వేసుకోని వారు బయట తిరగడంపై నిషేధం

ABN, First Publish Date - 2021-12-03T02:01:27+05:30

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కట్టడికి జర్మనీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కేవలం కరోనా టీకా తీసుకోని వారికే వర్తించేలా లాక్‌డౌన్ విధించింది. ఈ మేరకు జర్మనీ ఛాన్సలర్ యాంజెలా మర్కెల్, కాబోయే ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ గురువారం కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెర్లిన్: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కట్టడికి జర్మనీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కేవలం కరోనా టీకా తీసుకోని వారికే వర్తించేలా లాక్‌డౌన్ విధించింది. ఈ మేరకు జర్మనీ ఛాన్సలర్ యాంజెలా మర్కెల్, కాబోయే ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ గురువారం కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఈ లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఈ క్రమంలో కరోనా టీకా తీసుకోని వారు బహిరంగ ప్రదేశాలైన షాపింగ్ మాల్స్, ఇతర వినోద కార్యక్రమాలకు వెళ్లేందుకు అనుమతి లేదు. అత్యవసరాల కోసం సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులకు వెళ్లేందుకు మాత్రం టీకా తీసుకోని వారికి అనుమతి ఉంది. అంతేకాకుండా.. ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా టీకా తీసుకునేలా నిర్బంధ టీకాకరణ చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదనలు అక్కడి పార్లమెంటు ఆమోదం పొందితే వచ్చే ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2021-12-03T02:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising