ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్లుమూసి ఒంటిపైన కొండచిలువ వదిలారు.. Californiaలో Friendకి స్నేహితుల సర్‌ప్రైజ్.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN, First Publish Date - 2021-09-04T04:39:58+05:30

మీరెప్పుడైనా భారీ కొండచిలువను వాటేసుకున్నారా..? లేదా పట్టుకున్నారా..? ‘కొండచిలువను దూరం నుంచి చూస్తేనే పై ప్రాణాలు పైనే పోతాయి.. ఇక పట్టుకోవడం, కౌగలించుకోవడం కూడానా..?’ అని ఎదురు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మీరెప్పుడైనా భారీ కొండచిలువను వాటేసుకున్నారా..? లేదా పట్టుకున్నారా..? ‘కొండచిలువను దూరం నుంచి చూస్తేనే పై ప్రాణాలు పైనే పోతాయి.. ఇక పట్టుకోవడం, కౌగలించుకోవడం కూడానా..?’ అని ఎదురు ప్రశ్న వేయకండి. ఎందుకంటే మీరిప్పుడు చూడబోయే వీడియోలో ఓ వ్యక్తి ఏకంగా కొండచిలువను ఏదో డ్రెస్ వేసుకున్నట్లు శరీరానికి తగిలించుకున్నాడు. అది కూడా మామూలు కొండచిలువ కాదు రంగురంగుల రెయిన్‌బో కొండచిలువ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది.


ఇన్‌స్టాలో పోస్ట్‌లో షేర్ అయిన ఈ వీడియోలో బ్రూవర్ అనే వ్యక్తి ఈ తంతుకు సంబంధించిన విషయాలను వెల్లడించడం గమనించవచ్చు. తన రంగురంగుల కొండచిలువ పేరు మైలవ్ అని, దానిని సాయంతో ఓ వ్యక్తికి సర్‌ప్రైజ్ ఇచ్చామని చెప్పాడు. ఓ యువతి కోరిక మేరకు ఆమె ఇంట్లో ఓ వ్యక్తిపై తన ‘మై లవ్‌’ను వదిలానని చెప్పాడు. ‘అతడిని నేలపై పడుకోబెట్టి కళ్లకు గంతలు కట్టేశాం. నెమ్మదిగా బాక్స్‌లోని మైలవ్‌ను తీసుకెళ్లి అతడిపై వదిలిపెట్టాం. అయితే అతడు భయపడకుండా దానిని పాము అని గుర్తు పట్టేశాడు. కళ్లకు గంతలు తీసి దానిని చూసి ఆశ్చర్యపోయిడు. అయితే భయపడలేదు. అతడిని మైలవ్ చుట్టేస్తున్నా అలాగే పైకి లేచి ఎంచక్కా నడిచాడు’ అని బ్రూవర్ చెప్పుకొచ్చాడు. అయితే పామును శరీరంపై చుట్టుకున్న అతడికి భయం లేకపోయినా.. ఈ వీడియో చూస్తే మాత్రం చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. డౌట్ ఉంటే మీరూ చూడండి.



Updated Date - 2021-09-04T04:39:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising