ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రాన్స్ కీలక నిర్ణయం.. భారత ప్రయాణికులకు..!

ABN, First Publish Date - 2021-04-22T14:40:16+05:30

భారత్‌లో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ఫ్రాన్స్ వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధం అవుతోంది. ప్రయాణికులు 10 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండే విధంగా ఆదేశాలు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ విషయాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్: భారత్‌లో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ఫ్రాన్స్ వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధం అవుతోంది. ప్రయాణికులు 10 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండే విధంగా ఆదేశాలు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. బుధవారం రోజు ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పలు దేశాల్లో కరోనా తీవ్రత చాలా సీరియస్‌గా ఉన్నట్టు గుర్తించామన్నారు. ఈ క్రమంలో నిబంధనలు కఠినతరం చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు వెల్లడించారు. ‘పలు దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. అక్కడ ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అందుకే.. ఆయా దేశాల నుంచి ఫ్రాన్స్‌కు వచ్చే ప్రయాణికులపై కఠిన ఆంక్షలకు సిద్ధం అవుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయా దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. 


ఇదిలా ఉంటే.. తమ దేశంలో రోజువారి కొవిడ్ కేసుల సంఖ్య రానున్న రోజుల్లో భారిగా తగ్గే అవకాశం ఉందని ఫ్రాన్స్ భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం అమలవుతున్న దేశ వ్యాప్త కర్ఫ్యూ నిబంధనలను మే 2 తర్వాత సడలించేందుకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ కూడా స్పష్టం చేశారు. 


Updated Date - 2021-04-22T14:40:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising