ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విడాకుల తర్వాత విదేశీ భాగస్వాములు ఓసీఐ కార్డు పొందొచ్చా?!

ABN, First Publish Date - 2021-04-10T00:53:34+05:30

భారతీయులను పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న విదేశీ భాగస్వాములు ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) కార్డు పొందేందుకు అర్హులా? కాదా? అనే విషయంపై భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారతీయులను పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న విదేశీ భాగస్వాములు ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) కార్డు పొందేందుకు అర్హులా? కాదా? అనే విషయంపై భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. విడాకులు పొందిన తర్వాత విదేశీ భాగస్వాములు ఓసీఐ హోదాను కోల్పోతారని ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెల్జియం దేశానికి చెందిన ఓ మహిళ కొద్ది సంవత్సరాల క్రితం ఓ భారతీయుడిని వివాహమాడింది. అనంతరం సదరు మహిళ విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో బ్రస్సెల్స్‌లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరసత్వచట్టంలోని సెక్షన్ 7డీ(ఎఫ్) ప్రకారం.. ఆమె నుంచి ఓసీఐ కార్డును స్వాధీనం చేసుకుంది. దీంతో సదరు మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తనకు ఓసీఐ కార్డును ఇప్పించాల్సిందిగా ధర్మాసనాన్ని కోరింది. దీంతో కోర్టు.. భారత ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం.. విడాకులు పొందిన తర్వాత విదేశీ భాగస్వాములు ఓసీఐ హోదాను కోల్పోతారని అఫిడవిట్ ద్వారా స్పష్టం చేసింది. అంతేకాకుండా బ్రస్సెల్స్‌లోని భారత రాయబార కార్యాలయం చర్యను సమర్థించింది. 


Updated Date - 2021-04-10T00:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising