ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Corona నుంచి కోలుకుని 15 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన భార్య.. భర్త కోసం వెతుకుతూ గది తలుపులు తీయగానే..

ABN, First Publish Date - 2021-08-27T09:01:43+05:30

దాదాపు ఏడాదిన్నర కాలంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూ.. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూనే ఉంది. తాజాగా అమెరికాలోని ఓ మహిళకు కూడా ఈ మహమ్మారి కన్నీటినే మిగిల్చిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: దాదాపు ఏడాదిన్నర కాలంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూ.. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూనే ఉంది. తాజాగా అమెరికాలోని ఓ మహిళకు కూడా ఈ మహమ్మారి కన్నీటినే మిగిల్చింది. ఆసుపత్రిలో చికిత్స పొంది.. 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన భార్యను శోకసంద్రంలో ముంచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన లీసా స్టీడ్‌మ్యాన్ అనే మహిళ తన భర్త రాన్‌తో కలిసి పోల్క్ కౌంటీలో నివసిస్తోంది. గత కొద్ది నెలల క్రితం అమెరికాలో పరిస్థితులు మెరుగువతున్నట్టు అనిపించినప్పటికీ.. తాజాగా కరోనా వైరస్ మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది. దీంతో ఈ దంపతులు ఇద్దరూ కరోనా బారినపడ్డారు. లీసా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సింది వైద్యులు ఆమెకు సూచించారు. రాన్ ఆరోగ్యం బాగానే ఉండటంతో ఇంటి వద్దే ఉంటూ మందులు వాడాలని అతనికి సలహా ఇచ్చారు. దీంతో లీసా ఆసుపత్రిలో చికిత్స పొందతూనే ప్రతిరోజు భర్త ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా ఆరా తీసేది. ఈ క్రమంలో ఓ రోజు భర్త ఫోన్ కలవకపోవడంతో ఆమె కంగారు పడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి.. తన భర్తకు ఎలా ఉందో చూడమని కోరింది. 



దీంతో లీసా ఇంటిని సందర్శించిన పోలీసులు.. అంతా బాగానే ఉన్నట్టు చెప్పారు. ఇది జరిగిన రెండు రోజులకు లీసా ఆరోగ్యం కుదుటపడటంతో హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లింది. కరోనా నుంచి కోలుకుని దాదాపు 15 రోజుల తర్వాత ఇంటికెళ్లిన లీసా.. భర్త కోసం గది తలపులు తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ అయింది. అచేతనంగా పడి ఉన్న రాన్‌ను చూసి.. శోకసంద్రంలో మునిగిపోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించి తాను చనిపోతానేమో అని భావించానని.. కానీ తన భర్త ఊపిరిని మహమ్మారి తీసుస్తుందనుకోలేదని కన్నీటిపర్యంతం అయింది. అయితే తామిద్దరం కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోలేదని.. ఒకవేళ వేసుకుని ఉంటే.. ఇలా జరిగి ఉండేది కాదేమో అంటూ తన ఆవేదనను వ్యక్త పరిచింది. 


Updated Date - 2021-08-27T09:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising