ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైజర్‌ టీకాతో 6 నెలల పాటు బలమైన రక్షణ

ABN, First Publish Date - 2021-10-06T12:24:33+05:30

ఫైజర్‌ టీకా వేసుకుంటే కరోనాతో ఆస్పత్రిపాలయ్యే ముప్పు 90 శాతం దాకా తగ్గుతుందని అమెరికాకు చెందిన కైసర్‌ పర్మనెంటే కంపెనీ అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కనీసం 6 నెలలపాటు తీవ్ర ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశాలు కానీ, ఫలితంగా ఆస్పత్రి పాలయ్యే ముప్పు కానీ దాదాపు ఉండవని గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌తో ఆస్పత్రి పాలయ్యే ముప్పునకు చెక్‌ 

వాషింగ్టన్‌, అక్టోబరు 5 : ఫైజర్‌ టీకా వేసుకుంటే కరోనాతో ఆస్పత్రిపాలయ్యే ముప్పు 90 శాతం దాకా తగ్గుతుందని అమెరికాకు చెందిన కైసర్‌ పర్మనెంటే కంపెనీ అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కనీసం 6 నెలలపాటు తీవ్ర ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశాలు కానీ, ఫలితంగా ఆస్పత్రి పాలయ్యే ముప్పు కానీ దాదాపు ఉండవని గుర్తించారు. డెల్టా వేరియంట్‌ నుంచి కూడా ఫైజర్‌ టీకా బలమైన రక్షణ కల్పిస్తోందని తెలిపారు. రెండు డోసులు వేయించుకున్న మొదటి నెలలో టీకా ప్రభావశీలత 88 శాతం ఉండగా, అది ప్రతినెలా కొంతమేర తగ్గుతూ ఆరునెలల తర్వాత 47 శాతానికి క్షీణించిందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఇన్ఫెక్షన్‌ సోకినా తీవ్రమై ఆస్పత్రుల్లో చేరే పరిస్థితి రాకుండా చేసేందుకు టీకా ఉపకరిస్తోందని చెప్పారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ‘ది లాన్సెట్‌’ జర్నల్‌లో మంగళవారం ప్రచురితమైంది.

Updated Date - 2021-10-06T12:24:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising