ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార‌త్ నుంచి ఆస్ట్రేలియా చేరుకున్న తొలి రిపాట్రియేష‌న్ విమానం

ABN, First Publish Date - 2021-05-16T00:48:09+05:30

కరోనా నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన స్వదేశీ పౌరులను తిరిగి రప్పించేందుకు ఆస్ట్రేలియా ప్ర‌త్యేక విమాన స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా: కరోనా నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన స్వదేశీ పౌరులను తిరిగి రప్పించేందుకు ఆస్ట్రేలియా ప్ర‌త్యేక విమాన స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభించింది. దీనిలో భాగంగా శ‌నివారం భార‌త్ నుంచి 80 మంది ప్ర‌యాణికుల‌తో బ‌ల్దేరిన‌ తొలి రిపాట్రియేష‌న్ విమానం ఆస్ట్రేలియా చేరుకుంది. కాంటాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం 150 మంది ప్ర‌యాణికుల‌ను తీసుకెళ్లాల్సింది. అయితే, బోర్డింగ్‌కు ముందు నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌లో 40 మంది ప్ర‌యాణికుల‌కు పాజిటివ్ వ‌చ్చింది. దాంతో వారితో కాంటాక్ట్‌లో ఉన్న మ‌రో 30 మందిని కూడా అధికారులు ఇక్క‌డే ఆపేశారు. ఇలా సుమారు 70 మంది భార‌త్‌లోనే ఉండిపోయారు. ఇక ఆస్ట్రేలియా చేరుకున్న వారిని 14 రోజుల పాటు హోవార్డ్‌ స్పింగ్స్‌లోని జాతీయ రెజిలియన్స్‌ కేంద్రంలో క్వారంటైన్‌లో ఉంచనున్న‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. కాగా, భార‌త్‌లో క‌రోనా విల‌యం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఆస్ట్రేలియా రెండు వారాల పాటు భార‌త విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. 

Updated Date - 2021-05-16T00:48:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising