ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్‌తో యూకేలో తొలి మరణం

ABN, First Publish Date - 2021-12-14T14:15:22+05:30

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌తో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో తొలి మరణం నమోదైంది. ఈ విషయాన్ని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సోమవారం నిర్ధారించారు. ఒమైక్రాన్‌తో ఆస్పత్రుల్లో రోగుల చేరికలు పె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకటించిన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కరోనా

లండన్‌, డిసెంబరు 13: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌తో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో తొలి మరణం నమోదైంది. ఈ విషయాన్ని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సోమవారం నిర్ధారించారు. ఒమైక్రాన్‌తో ఆస్పత్రుల్లో రోగుల చేరికలు పెరుగుతున్నట్లు చెప్పారు. ఆదివారం ఒక్కరోజే 1,239 కేసులు నమోదయ్యాయి. వీటిలో 40 శాతం రాజధాని లండన్‌లోనే వచ్చాయి. దేశంలో ఇప్పటివరకు 3 వేలమందిపైనే ఒమైక్రాన్‌ బారినపడ్డారు. ఆదివారం రాత్రి అత్యవసరంగా జాతినుద్దేశించి ప్రసంగించిన బోరిస్‌ జాన్సన్‌.. ఒమైక్రాన్‌ విరుచుకు పడబోతోందని హెచ్చరించారు. ఒమైక్రాన్‌పై పోరాటానికి కొత్త ప్రణాళిక ప్రకటించారు. 


నైట్‌ క్లబ్‌లకు వెళ్లాలంటే టీకా ధ్రువపత్రాన్ని, ఇన్‌డోర్‌ కార్యక్రమాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేశారు. వీలైతే ఇంటి నుంచి పనిచేయాలని పేర్కొన్నారు. అందరూ బూస్టర్‌ తీసుకోవాలని సూచించారు. మే నెల తర్వాత తొలిసారి యూకేలో లెవల్‌-4 హెచ్చరికలు జారీ చేశారు. శనివారం 50 లక్షలమందిపైనే బూస్టర్‌ డోసు పొందారు. బ్రిటన్‌లో 12 ఏళ్లు దాటి న పిల్లల్లో 80ు మందికి టీకా రెండు డోసులు వేశారు. టీనేజర్లలో 40ు మంది మూడో డోసు కూ డా పొందారు. ఇక.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా (69)కు కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఆ దేశంలో ఆదివారం 37వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, చైనాలో తొలిసారి డెల్టా వేరియంట్‌ ఉప ఉత్పరివర్తనం ఏవై.4 కేసులు వచ్చాయి.




Updated Date - 2021-12-14T14:15:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising