ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిటికీకి వేలాడి.. పైపు పట్టుకుని జారి.. ఐదో అంతస్తు నుంచి క్షేమంగా కిందికి!

ABN, First Publish Date - 2021-12-20T13:56:35+05:30

అది 30 అంతస్తుల భవనం. అందులో ఐదో అంతస్తులోని ఓ అపార్ట్‌మెంట్‌ కిటికీ నుంచి అగ్నికీలలు ఎగసిపడుతుండగా.. 13 ఏళ్ల అమ్మాయి ఆ కిటికీ తలుపు పట్టుకుని ప్రమాదకమైన స్థితిలో వేలాడుతోంది. ఇంతలో 1

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగ్ని ప్రమాదం నుంచి సినీ ఫక్కీలో తప్పించుకున్న అన్నాచెల్లెళ్లు

న్యూయార్క్‌, డిసెంబరు 19: అది 30 అంతస్తుల భవనం. అందులో ఐదో అంతస్తులోని ఓ అపార్ట్‌మెంట్‌ కిటికీ నుంచి అగ్నికీలలు ఎగసిపడుతుండగా.. 13 ఏళ్ల అమ్మాయి ఆ కిటికీ తలుపు పట్టుకుని ప్రమాదకమైన స్థితిలో వేలాడుతోంది. ఇంతలో 18 ఏళ్ల యువకుడు కూడా అదే కిటికీలో నుంచి బయటకు వచ్చి.. అదే తలుపు పట్టుకున్నాడు. ఆ ఇద్దరి బరువుతో ఆ కిటికీ ఏ క్షణమైనా ఊడిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో.. తమకు అందేంత దూరంలో ఉన్న ఓ డ్రైనేజీ పైపును వారిద్దరూ పట్టుకున్నారు. జాగ్రత్తగా కిటికీ తలుపును వదిలేసి.. డ్రైనేజీ పైపును గట్టిగా పట్టేసుకున్నారు. కింద నుంచి ఇదంతా చూస్తున్న వాళ్లలో ఉత్కంఠ తారస్థాయికి చేరుతోంది. 



పైపుపై పట్టు ఏర్పడ్డాక.. ఆ కుర్రాడు నెమ్మదిగా కిందికి జారాడు.  తనలాగేచేయాల్సిందిగా ఆ అమ్మాయికీ సూచించాడు. నెమ్మదిగా ఇద్దరూ ఒక్కో అంతస్తూ జారుకుంటూ.. ఎట్టకేలకు క్షేమంగా కిందికి చేరారు. దీంతో.. అక్కడున్న అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇదేదో సినిమా షూటింగ్‌ అనుకుంటున్నారా..! కాదండీ.. అమెరికాలోని న్యూయార్క్‌లో శనివారం సినీఫక్కీలో జరిగిన యదార్థ ఘటన. అక్కడి ఓ అపార్ట్‌మెంట్లో అగ్నిప్రమాదం నుంచి ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఇలా సాహసోపేతంగా బయటపడ్డారు. దురదృష్టవశాత్తూ వారి తండ్రి మంటల్లో చిక్కి కన్నుమూశాడు. తల్లి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బ్యాటరీ కారణంగానే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.




Updated Date - 2021-12-20T13:56:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising