ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీ నిపుణులకు భారీగా వేతనాలు

ABN, First Publish Date - 2021-01-14T11:33:10+05:30

అమెరికన్ల ప్రయోజనాలకు పెద్దపీట వేసే క్రమంలో ట్రంప్‌ చివరి అస్త్రాన్నీ ప్రయోగించారు. ప్రతిభ ఉన్న వారికే హెచ్‌1బీ వీసాలిచ్చేలా మొన్నటికి మొన్న నోటిఫికేషన్‌ ఇచ్చిన ఆయన యంత్రాంగం.. తాజాగా విదే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హెచ్‌1బీ, గ్రీన్‌కార్డుదారులకు పెంపు ఖరారు.. అమెరికా కార్మిక శాఖ తుది ప్రకటన


న్యూఢిల్లీ, జనవరి 12 : అమెరికన్ల ప్రయోజనాలకు పెద్దపీట వేసే క్రమంలో ట్రంప్‌ చివరి అస్త్రాన్నీ ప్రయోగించారు. ప్రతిభ ఉన్న వారికే హెచ్‌1బీ వీసాలిచ్చేలా మొన్నటికి మొన్న నోటిఫికేషన్‌ ఇచ్చిన ఆయన యంత్రాంగం.. తాజాగా విదేశీ నిపుణుల వేతనాలను భారీగా పెంచింది. ఈ మేరకు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. హెచ్‌1బీ, గ్రీన్‌కార్డుదారుల కోసం తుది వేతన నిబంధనలకు అమెరికా కార్మిక శాఖ(డీవోఎల్‌) పచ్చజెండా ఊపింది. ఈ నిబంధనలు దశలవారీగా అమల్లోకి వస్తాయని మంగళవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) ప్రకటించింది. కొత్త వేతన నిబంధనలను గురువారం అధికారికంగా ఫెడరల్‌ రిజిస్టర్‌లో ప్రచురిస్తారు. అప్పటి నుంచి 60 రోజుల్లోగా ఇవి అమల్లోకి వస్తాయి. ‘గత అక్టోబరు 20న తాత్కాలిక తుది నిబంధన(ఐఎ్‌ఫఆర్‌)ను ప్రకటించి..  ప్రజల నుంచి అభిప్రాయాలు కోరాం. వాటన్నింటినీ సమీక్షించి తుది నిబంధనలు ఖరారు చేశాం. అతి తక్కువ వేతనాలకే విదేశీ నిపుణులను తీసుకుంటూ, అమెరికన్ల ఉద్యోగావకాశాలను దెబ్బ తీసే పద్ధతులకు అడ్డుకట్ట వేసేందుకే ఈ మార్పులన్నీ..’ అని డీవోఎల్‌ వెల్లడించింది. వర్క్‌ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా వేతన నిబంధనలను సవరించామని వివరించింది. లెవల్‌-1 నుంచి లెవల్‌-4(అత్యధిక నైపుణ్యం) వరకు నాలుగు స్థాయిల్లో వేతనాలను వర్గీకరించారు. 



Updated Date - 2021-01-14T11:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising