ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీరా టాండన్ కోసం పోరాడుతున్నాం: వైట్‌హౌస్

ABN, First Publish Date - 2021-02-25T22:49:35+05:30

భారత సంతతి మహిళ నీరా టాండన్‌ను మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారత సంతతి మహిళ నీరా టాండన్‌ను మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆమె నామినేషన్‌పై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నీరా నామినేషన్ కన్ఫర్మేషన్ కోసం పోరాడుతున్నట్లు తాజాగా వైట్‌హౌస్ వెల్లడించింది. ఆమె నామినేషన్‌ను నిర్ధారించడానికి భేటీ కావాల్సిన రెండు సెనేట్ కమిటీలు ఈ సమావేశాన్ని వాయిదా వేశాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అధ్యక్ష భవనం నీరా నామినేషన్ కోసం ఫైట్ చేస్తున్నట్లు తెలియజేసింది. 'ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించగల అన్ని అర్హతలు ఆమెకే ఉన్నాయి' అని ఈ సందర్భంగా వైట్‌హౌస్ పేర్కొంది. ఇక నీరా టాండన్ గతంలో పలువురు నేతలపై చేసిన పక్షపాత ట్వీట్లు ఇప్పుడు ఆమెకు అవరోధంగా మారాయి. వాటిని బయటకు తీసి.. రిపబ్లికన్ సెనేటర్లు నీరా నామినేషన్‌ను వ్యతిరేకిస్తున్నారు. నీరాకు మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారట. 

Updated Date - 2021-02-25T22:49:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising