ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు కొనసాగుతున్న అమెరికా సాయం !

ABN, First Publish Date - 2021-05-04T16:02:08+05:30

మహమ్మారి కరోనాతో అల్లాడుతున్న భారత్‌ను ఆదుకునే దిశగా అగ్రరాజ్యం అమెరికా సాయం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికా నుంచి భారత్ చేరిన 545 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు..

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనాతో అల్లాడుతున్న భారత్‌ను ఆదుకునే దిశగా అగ్రరాజ్యం అమెరికా సాయం కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు దఫాల్లో కీలక వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు భారత్‌కు పంపించిన జో బైడెన్ సర్కార్.. తాజాగా మరో 545 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపింది. మంగళవారం ప్రత్యేక మిలిటరీ విమానంలో ఇవి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూఎస్ సహాయానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి ట్విటర్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మరికొన్ని కోవిడ్ వైద్య సామాగ్రితో కూడిన మరో రెండు విమానాలు బుధవారం నాటికి భారత్‌కు చేరుకుంటాయని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ వెల్లడించింది. నిర్వహణ సమస్యల కారణంగా ఈ రెండు విమానాలు ఆలస్యమైనట్లు యూఎస్ రవాణా కమాండ్ సోమవారం తెలియజేసింది. ఇక ఆదివారం అమెరికా నుంచి 1.25 లక్షల రెమ్‌డెసివర్ వయల్స్‌తో ఓ విమానం భారత్‌కు వచ్చింది. అలాగే శనివారం 1000 ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్లు, ఇతర వైద్య పరికరాలతో మరో విమానం భారత్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా, భారత్‌కు అత్యవసర వైద్య సాయంగా అగ్రరాజ్యం 100 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఐదు దఫాలలో కీలకమైన వైద్య సామాగ్రిని భారత్‌కు చేర్చింది.      

Updated Date - 2021-05-04T16:02:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising