ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికన్లకు ఆంథోనీ ఫౌసీ గట్టి వార్నింగ్ !

ABN, First Publish Date - 2021-04-06T23:38:01+05:30

మహమ్మారి కరోనావైరస్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే.. అంతే సంగతులంటూ అమెరికన్లకు ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు డా. ఆంథోనీ ఫౌచీ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: మహమ్మారి కరోనావైరస్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే.. అంతే సంగతులంటూ అమెరికన్లకు ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు డా. ఆంథోనీ ఫౌచీ హెచ్చరించారు. వైరస్ పట్ల నిర్ణక్ష్యం చూపితే మళ్లీ విజృంభించే అవకాశం ఉందని, మరోసారి భారీ మూల్యం చెల్లించక తప్పదని ఫౌసీ దేశ పౌరులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అందుకే ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి నివారణకు ఆయన రెండు కీలక సూచనలు చేశారు. 'కొత్త కేసులు, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలను నిరోధించాలంటే రెండు కీలక మార్గాలున్నాయి. వాటిల్లో ఒకటి.. ప్రజారోగ్య చర్యలను మెరుగుపర్చటం. రెండోది వీలైనంత మందికి సాధ్యమైనంత త్వరగా టీకాలు వేయడం.' అని ఫౌసీ తెలిపారు.


ఇదిలాఉంటే.. గడిచిన వారంలో యూఎస్‌లో ఏకంగా 30 లక్షల కొత్త కేసులు బయటపడ్డాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5.54లక్షల మంది వైరస్‌కు బలయ్యారని పేర్కొంది. ఇక అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ, దేశవ్యాప్తంగా​ ఇప్పటికీ 31.4శాతం మంది మాత్రమే ఒక డోసు టీకా తీసుకున్నారు. అలాగే కేవలం 18 శాతం మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. మొత్తంగా అమెరికాలో ఇప్పటివరకు 101 మిలియన్ మోతాదులకు పైగా వ్యాక్సిన్ ఇవ్వబడింది. మరోవైపు అధ్యక్షుడు జో బైడెన్.. మే 1 నుంచి దేశంలోని వయోజనులందరికీ టీకాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడమే వైరస్ వ్యాప్తిని అరికట్టగలవని బైడెన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-04-06T23:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising