ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత హాకీ జట్టు విజయాన్ని.. బుర్జ్‌ ఖలీఫా వద్ద సెలబ్రేట్ చేసుకున్న ప్రవాసులు!

ABN, First Publish Date - 2021-08-07T14:48:30+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సంచలనమైన ఆటతీరుతో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సంచలనమైన ఆటతీరుతో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. కాంస్య పోరులో జర్మనీపై 5-4 తేడాతో భారత్ సంచలన విజయంతో పతకాన్ని ముద్దాడింది. దీంతో 41 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ భారత హాకీ జట్టు దేశానికి మరో పతకం అందించినట్లైంది. ఈ విజయం యావత్ భారతావణి గర్వపడేలా చేసింది. తాజాగా యూఏఈలోని కొందరు భారత ప్రవాసులు ఈ అపూర్వ విజయాన్ని ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్‌ ఖలీఫా వద్ద సెలబ్రేట్ చేసుకున్నారు.


భారత జాతీయ జెండాతో పాటు, హాకీ జట్టు సభ్యుల ఫొటోలతో ఉన్న ప్లడ్‌కార్డులను ప్రదర్శించారు. నాలుగు దశాబ్దాల తర్వాత భారత్‌కు దక్కిన ఈ విజయం ఎంతో గొప్పదని వారు స్వీట్లు పంచుకున్నారు. భారత హాకీ జట్టు నిజంగా అద్భుతం చేసిందన్నారు. ఒకప్పుడు హాకీలో తిరుగులేకుండా ఉన్న భారత్‌కు గడిచిన కొన్నేళ్లుగా కఠినంగా గడిచాయని ప్రవాసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు భారత హాకీకి మంచి రోజులు వస్తున్నాయని తెలిపారు. ఈ విజయం భారత హాకీకి పునర్జీవనం లాంటిదన్నారు. అటు మహిళల హాకీ జట్టు ప్రదర్శన కూడా అమోఘమని పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-07T14:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising