ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwaitలో వలసదారులకు కొత్త కష్టం.. అడుగుపెట్టగానే వాళ్లంతా మీద పడుతున్నారే..!

ABN, First Publish Date - 2021-09-14T00:52:08+05:30

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అనేకమంది ఇతర దేశాలకు చెందిన వారు మళ్లీ అక్కడకు చేరుకుంటున్నారు. అనేక దేశాల నుంచి ఇప్పటికే అనేకమంది కువైత్‌లో అడుగుపెట్టి తమ ఉద్యోగాల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అనేకమంది ఇతర దేశాలకు చెందిన వారు మళ్లీ అక్కడకు చేరుకుంటున్నారు. అనేక దేశాల నుంచి ఇప్పటికే అనేకమంది కువైత్‌లో అడుగుపెట్టి తమ ఉద్యోగాల్లో చేరుతున్నారు. అయితే ఇదే సమయంలో వారిని అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా కోవిడ్ ముందు కువైత్‌లో ఉండగా చేసిన అప్పులు, ఇళ్ల అద్దెలు, ఈఎంఐలు, లోన్లు.. ఇలా అనేక ఆర్థిక సమస్యలు వారిని ఊపిరాడనివ్వడం లేదు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఉద్యోగులకు ఏళ్లు పట్టొచ్చు. లేదా కొన్ని నెలలైనా పట్టొచ్చు.


కోవిడ్ కారణంగా తమ దేశాల్లో లేదా ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన ఉద్యోగులు.. కువైత్‌లో తమ అపార్ట్‌మెంట్లను ఖాళీ చేయలేకపోయారు. దీంతో ఆ ఇళ్లన్నీ ఆయా ఉద్యోగుల ఆధీనంలోనే ఉన్నాయి. ఇప్పుడు తిరిగి కువైత్ వెళ్లడం, ఉద్యోగాల్లో చేరడంతో ఇళ్ల యజమానులు ఒక్కసారిగా తమ బకాయిలన్నీ చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీనికి తోడు కార్ల ఈఎంఐలు, ఇతర ఈఎంఐలు, లోన్లు తిరిగి చెల్లించాలని ఆయా సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయి. కొందరి విషయంలో ఇది కోర్టుల వరకు వెళుతోంది. దీంతో సదరు విదేశీ ఉద్యోగులు కువైత్‌లో కొత్త సమస్యతో సతమవుతున్నారు. 

Updated Date - 2021-09-14T00:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising