ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు విమాన సర్వీసులపై ఎమిరేట్స్ కీలక ప్రకటన!

ABN, First Publish Date - 2021-07-03T14:42:43+05:30

భారత్‌కు విమాన సర్వీసులు నడపడంపై యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా కీలక ప్రకటన చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇండియాకు అన్ని ప్యాసెంజర్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: భారత్‌కు విమాన సర్వీసులు నడపడంపై యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా కీలక ప్రకటన చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇండియాకు అన్ని ప్యాసెంజర్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక గత 14 రోజుల్లో భారత్‌కు వెళ్లిన వారు ఇతర ఏ దేశం మీదుగానైనా తిరిగి యూఏఈకి వచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. కాగా, యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యాధికారులు, సవరించిన కోవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేక అనుమతి ఉన్నవారికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది.


ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాజాగా భారత్‌ సహా 14 దేశాలకు తమ దేశం నుంచి ప్రజలు వెళ్లకుండా యూఏఈ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ దేశాల జాబితాలో బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, కాంగో, ఉగాండా, సియెరా లియోన్‌, లైబీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా ఉన్నాయి. జూలై 21 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు జాతీయ అత్యవసర, సంక్షోభ, విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది.   

Updated Date - 2021-07-03T14:42:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising